Prabhas: సలార్ మూవీకి కూడా వేణుస్వామి జోస్యం.. టెన్షన్‌లో ప్రభాస్ ఫ్యాన్స్
బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేసిన ఆ రేంజ్ హిట్ రావడం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా డీలా పడిపోతున్నారు. ఇక తాజాగా ప్రభాస్ సలార్ అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా హిట్ అవుతుంది.. మళ్లీ ప్రభాస్ కంబ్యాక్ ఇస్తాడు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రమంలో వేణుస్వామి చెప్పిన జోస్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన కామెంట్స్ తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ టెన్షన్ లో పడిపోయారు. అసలు విషయం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బహుబలి ఏ ముహుర్తన ప్రభాస్ చేశాడో... ఆ సినిమాలు అయితే హిట్ అయ్యాయి కానీ... ఆ తర్వాత చేసిన ప్రభాస్ సినిమాలు మాత్రం ఫ్లాప్ అవుతున్నాయి. పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ వచ్చింది.. కానీ ఆ రేంజ్ హిట్ మాత్రం ప్రభాస్ కు పడటం లేదు. బహుబలి తర్వాత చేసిన సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు.

ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ... విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం సలార్. ఇక ఈ చిత్రం ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. సలార్ పైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల ప్రభాస్ సలార్ ట్రైలర్ రిలీజ్ అయింది. కానీ ఆ ట్రైలర్ ఆ ఆశలపై నీళ్లు చల్లినట్టు చేసిందనే చెప్పాలి. ఇందులో ప్రభాస్ కనిపించిన తీరు... ఆయన డైలాగులు చూశాక ఫ్యాన్స్ కు నీరసం వచ్చేసింది. ఫ్యాన్స్ అంతా డిజప్పాయింట్ అయిపోయారు.
ఇక సలార్ సినిమా రిలీజ్ కాకముందే ఆ సినిమాపై నెగిటివ్ టాక్ మొదలు అయిపోయింది. ఈ సినిమా కూడా ప్రభాస్ కు ఫెయిల్యూర్ తీసుకువస్తుందా ఏంటి అని సందేహాలు మొదలు అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో వేణు స్వామి చెప్పిందే ఇప్పుడు నిజం కాబోతుందా అనే డౌట్ కలుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు.

ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో కొందరు సెలబ్రిటీలపై చేసిన వ్యాఖ్యలు నిజమవగా... ముఖ్యంగా నాగచైతన్య, సమంతల విడాకులతో ఆయన ఫేమస్ అయిపోయారు. వీరు పెళ్లి చేసుకున్నాక ఈ జంట వీడిపోతుందంటూ ముందే కామెంట్స్ చేశారు. అనుకున్నట్లుగానే ఆ జంట విడాకులు ప్రకటించి.. వేణుస్వామికి పేరును తీసుకువచ్చింది. ఇక ఆ తర్వాత ప్రభాస్ విషయంలో చేసిన కామెంట్స్ కూడా చాలా వరకు నిజం అయ్యాయి.
ఆదిపురుష్ సమయంలోనే వేణు స్వామి ఈ సినిమా హిట్ కాదు అని చెప్పుకువచ్చారు. ఇక ఆయన చెప్పినట్లుగానే జరిగింది. ఆ సమంయంలోనే సలార్ కూడా కష్టమే అని చెప్పుకువచ్చారు. ఇక ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సలార్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. వేణు స్వామి చెప్పిందే జరుగుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. వేణు స్వామి చెప్పిందే నిజం కానుందా అని ఆందోళన చెందుతున్నారు.
ఇక ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతుండగా... ప్రాణమిచ్చే స్నేహితులు ఎందుకు విడిపోయారు, ఎందుకు బద్ద శత్రువులుగా మారారనేది కథగా తెరకెకక్కించారు ప్రశాంత్ నీల్. ఈ నెల 22న సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హింధీ భాషల్లో రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











