Salaar: ప్రభాస్ జాతకం విషయంలో వేణు స్వామి చెప్పిందే అయిందిగా... సలార్ విషయంలో నిర్మాత సంచలన నిర్ణయం
ప్రముఖ సినీ జోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమా ప్రముఖులకు జోతిష్యం చెబుతూ.. పాపులర్ అయిన ఈయన.. ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. నాగచైతన్య సమంత విషయంలో చెప్పిన జాతకం నిజం కావడంతో వెలుగులోకి వచ్చిన వేణుస్వామి... ఇప్పుడు మరోసారి ప్రభాస్ జాతకం విషయంలో చెప్పింది నిజం అయిందని తెలుస్తోంది. అసలు విషయం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్'. ఇక ఈ చిత్రాన్ని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఫస్ట్ పార్ట్ సలార్ 'సీజ్ ఫైర్' డిసెంబర్ 22వ తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి..

సలార్ చిత్రం సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాల్సి ఉండగా... మేకర్స్ పోస్టుపోన్ చేసి డిసెంబర్ కి తీసుకు వచ్చారు. ఈ కొత్త విడుదల తేదీలో సలార్ సినిమాతో పాటు షారుఖ్ ఖాన్ 'డంకీ', హాలీవుడ్ మూవీ 'అక్వామన్' కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే అసలు సలార్ మూవీ టీం ఎందుకు పోస్టు పోన్ చేశారు అనేది మాత్రం ఆసక్తిగా మారింది.
తాజాగా ఈ ప్రశ్నకు సలార్ నిర్మాత విజయ్ కిరంగదూర్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ కిరంగదూర్ మాట్లాడుతూ.. మేము జాతకాలు బాగా నమ్ముతామని చెప్పుకువచ్చారు. దశాబ్దం కాలంగా మేము అనుసరిస్తున్న పద్ధతిలోనే సలార్ రిలీజ్ డేట్ ని కూడా ఎంపిక చేశామని వెల్లడించారు. అలాగే సలార్ మూవీ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన మొదటి చిత్రం ఉగ్రమ్ రీమేక్ అంటూ వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చాడు నిర్మాత.
ఉగ్రం రీమేక్ అనే వార్తలపై నిజం లేదని చెప్పుకువచ్చారు. ఆ వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఉగ్రమ్, కేజీఎఫ్, సలార్.. ఇలా ప్రతిదానిని ప్రశాంత్ నీల్ భిన్నంగా తెరకెక్కించారని చెప్పుకువచ్చారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో వేగం పెంచామని వెల్లడించారు. సలార్ నుంచి రేపు 'సూరీడే' అనే పాటను విడుదల చేయనున్నామని తెలిపారు. ఇక మరో యాక్షన్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇలా ఫుల్ అప్డేట్స్ వచ్చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ప్రముఖ సినీ జోతిష్కుడు వేణు స్వామి చెప్పిందే నిజం అయిందని తెలుస్తోంది. ఎందుకంటే.. గతంలో ప్రభాస్ జాతకం చెబుతూ... ప్రభాస్ జాతకం బాగాలేదని చెప్పుకువచ్చారు. ఆయనతో సినిమాలు తీసే నిర్మాతలు కూడా జాతకాలు చూపించుకోవాలని చెప్పుకువచ్చాడు. అలా ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు నిజం అవుతున్నాయి. మరి సలార్ పరిస్థితి ఏంటో అని ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు.


Click it and Unblock the Notifications











