Venu Swamy: ఇండస్ట్రీలో మరో జంట విడాకులు... వేణు స్వామి జోస్యం నిజం అవుతుందా?
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇక ఆయన జ్యోతిష్యం చెబితే సంచలనం.. సెలబ్రెటీల పర్సనల్ విషయాలపై జోస్యం చెబుతూ ఫేమస్ అయ్యారు. ఇక ఆయన చెప్పిన మాటలు మరోసారి నిజం అయ్యేలా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఆ జంట ఎవరు.. ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వేణు స్వామి ఆ మధ్యకాలంలో ఏం చెప్పిన అదే జరిగిందనే విషయం తెలిసిందే. దాంతో ఆయన తన జ్యోతిష్యం ద్వారా చాలా పాపులారిటీని దక్కించుకున్నారు. అయితే ఈ విషయాలు కొంతమంది నమ్మితే మరి కొంతమంది నమ్మరనే విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా సమంత నాగచైతన్య విషయంలో చెప్పిన జోస్యం నిజం కావడంతో ఈయనకు పాపులారిటీ వచ్చింది. సమంత, నాగచైతన్య విడాకుల తర్వాతే వేణుస్వామి వెలుగులోకి వచ్చారు.

అలాగే వేణు స్వామి చేత పూజలు చేయించుకున్న హీరోయిన్లందరికీ స్టార్డమ్ రావడంతో ఈయన చాలా మందికి నమ్మకం కలిగింది. ఇక ఈయన బయటపెట్టే సంచలన విషయాల కోసం చాలామంది యూట్యూబర్లు ఆయనను ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. అలా ఎన్నో ఇంటర్వ్యూలలో హీరో హీరోయిన్లకు సంబంధించి, రాజకీయ నాయకులకు సంబంధించి ఎన్నో సంచలన విషయాలు బయట పెట్టి పాపులర్ అయ్యారు.
ఇప్పటికే ప్రభాస్, నాగచైతన్య, సమంత,రకుల్ ప్రీత్ సింగ్, నయనతార, రష్మిక మందన్న, అల్లు అర్జున్,ఎన్టీఆర్,అఖిల్, అనుష్క ఇలా ఎంతోమంది హీరో హీరోయిన్ల జాతకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో నయనతార గురించి మాట్లాడుతూ.. నయనతార పెళ్లి చేసుకుంటే కచ్చితంగా విడాకులు అవుతాయని చెప్పుకువచ్చారు. ఆమెను పెళ్లి చేసుకుంటే పెళ్లయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వెల్లడించారు.
చివరికి భర్తతో కలిసి ఉండక విడాకులు తీసుకుంటుందని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక వేణు స్వామి అప్పుడు చెప్పిన విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు కానీ.. అప్పట్లో నయన్ అభిమానులు అయితే ఆయన్ని బండబూతులు తిట్టారు. శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే ఇలాంటి మాటలు అవసరమా అంటూ ఫైర్ అయ్యారు. కానీ వేణు స్వామి జోస్యం ఇప్పుడు నిజమవబోతుందని కొందరూ భావిస్తున్నారు.

నయనతార పెళ్లయ్యాక ఆమె చాలా వివాదాల్లో చిక్కుకుంది. పెళ్లయిన తర్వాత తిరుమల మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని తిరిగి వివాదంలో చిక్కుకోగా... అలాగే కవల పిల్లల విషయంలో సరోగసి పద్ధతి వల్ల కూడా సమస్యలు తలెత్తాయి. ఇక ఇటీవల ఆమె నటించిన అన్నపూరిణి అనే మూవీ వల్ల కూడా నయనతార వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. కొంతమంది హిందువులు అయితే ఈమెపై కేసు కూడా పెట్టినట్లు తెలుస్తోంది.
ఇక తాజాగా నయనతార భర్త విఘ్నేష్ శివన్ కూడా తన దర్శకత్వంలో వహిస్తున్న ఎల్ఐసి అనే మూవీ వల్ల ఈయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈయనకు ఎల్ఐసి సంస్థ నుండి లీగల్ గా నోటీసులు వచ్చిన సంగతి తెలిసిందే. ఎల్ఐసి టైటిల్ పెట్టడం వల్ల ఈయన వివాదంలో చిక్కుకున్నారు. ఇలా పెళ్లయిన తర్వాత తరచూ వీళ్లిద్దరూ ఏదో ఒక ఇబ్బందుల్లో పడుతూనే వస్తున్నారు. దాంతో వీరి పెళ్లి తర్వాత చిక్కుల్లో పడతారని చివరికి విడాకులు తీసుకుంటారని వేణు స్వామి చెప్పింది జరుగుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











