Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 2024లోనూ అదే రిపీట్ కాబోతుందట!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు వింటే చాలు చాలా మంది అభిమానులు... మా అన్నయ్య, మా అన్నయ్య అంటూ నెత్తిన పెట్టుకుంటారు. ఆయన ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అది ఏమాత్రం తప్పు కాదని చెబుతూ వస్తుంటారు. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడొద్దు అంటూ వార్నింగ్ ఇస్తుంటారు కూడా. రాజకీయాల్లో కూడా ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని తెగ విమర్శలు చేస్తుంటారు నేతలు.

కానీ తాను మాత్రం అది తన పర్సనల్ విషయం అని.. ఎవరూ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని.. మీక్కూడా చేస్కోవాలనిపిస్తే మూడు పెళ్లిళ్లు చేసుకోండంటూ పవన్ కల్యాణ్ కూడా చెప్పారు. ఇప్పటికే ఈయన పెళ్లిళ్ల గురించి చాలా మంది చాలా రకాల చర్చలు చేస్తుండగా.. ప్రముఖ జ్యోతిష్యుడు అయిన వేణు స్వామి మరో బాంబ్ పేల్చారు. 2024లో పవన్ కల్యాణ్ మరోసారి కాంట్రవర్సీ పాలవుతారని చెప్పుకొచ్చారు. అతడికి సినిమా పరంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉందని చెప్పుకొచ్చారు. కానీ పర్సనల్ లైఫ్ కు సంబంధించి చాలా కాంట్రవర్సీలు జరగబోతున్నాయని.. వాటన్నిటినీ ఆయన ఫేస్ చేయక తప్పదు అంటూ వివరించారు.

Venu Swamy Shocking Comments on Pawan Kalyan Check Details

వాస్తవానికి ఆయను చెప్పే మగాడు లేకే ఆయన రాజకీయాలు చేస్తూ అనసవరంగా పేరు నాశనం చేసుకుంటున్నారని అన్నారు. అలాగే ఆయన ముఖ్యమంత్రి అయితే చూడాలనుకునే వాళ్లలో తాను ప్రథముడిని అని కానీ ఆ విషయం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు అర్థం కాక అనవసరంగా తనపై ట్రోల్స్ చేస్తుంటారని ఫైర్ అయ్యారు. అయితే 2024 జులై తర్వాత పవన్ కల్యాణ్ మూడో సారి విడాకులు తీసుకునే అవకాశం ఉందని వేణు స్వామి వెల్లడించారు. ఎన్నికలు అయిపోగానే మూడో భార్య అన్నా లెజినోవాకు ఆయన దూరం అయ్యే ఛాన్స్ అధికంగా కనిపిస్తుందన్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తప్ప పవన్ కల్యాణ్ కు చెప్పే వాడే లేడని.. కానీ ఆయన పర్సనల్ విషయాల్లో ఏమాత్రం జోక్యం చేసుకోరని వేణు స్వామి వివరించారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ ఈ విషయం గురించి ఓసారి ఆలోచించి ఏం చేస్తే తాను సీఎం అవుతానో అర్థం చేసుకోవాలని అన్నారు. ఆయన ఎన్ని సినిమాలు తీసినా అవి కచ్చితంగా సూపర్ డూపర్ హిట్లు అవుతాయని వెల్లడించారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది. వేణుస్వామి చెప్పిందే నిజం అవుతుందా లేక తప్పు అవుతుందా అనేది.

Venu Swamy Shocking Comments on Pawan Kalyan Check Details

పవన్ కల్యాణ్ 1997లో మొదటి సారి నందిని పెళ్లి చేసుకున్నారు. పదేళ్ల పాటు హాయిగానే సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు రావడంతో ఇద్దరూ 2007లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లకే పవన్ కల్యాణ్ హీరోయిన్ రేణూ దేశాయ్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు అకీరా నందన్, ఆద్యలు పుట్టారు. కానీ ఆ తర్వాత మూడేళ్లకే వీరు విడాకులు తీసుకోగా.. 2013లో పవన్ కల్యామ్ అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెతో కలిసి ఉంటున్నారు. ఈ జంటకు మార్క్ శంకర్ పవనోవిచ్, పొలెనా అంజనా పవనోవా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X