For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  SSMB28: మహేశ్ మూవీలో మరో హీరో.. సునీల్‌లా మరో ఫ్రెండ్‌కు త్రివిక్రమ్ సాయం

  |

  బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనలోని అన్ని రకాల టాలెంట్లను చూపించి టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయాడు హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. అంతేకాదు, కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో వరుసగా 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో హ్యాట్రిక్‌ను నమోదు చేసుకోవడంతో పాటు మహేశ్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసి హవాను చూపిస్తున్నాడు.

  శివాత్మక రాజశేఖర్ అందాల జాతర: స్లీవ్‌లెస్ టాప్‌తో ఓ రేంజ్ ట్రీట్

  హిట్లు మీద హిట్లు కొడుతూ సూపర్ డూపర్ ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు ఇటీవలే 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేశాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం టార్గెట్‌కు దగ్గరగా వచ్చింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద సెమీ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. ఈ ఫలితంతో సంతృప్తిగానే ఉన్న ఈ స్టార్ హీరో.. తన తదుపరి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అలాగే, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.

  Venu Thottempudi Key Role in Mahesh Babu Movie

  దాదాపు 11 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుండడంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రం నుంచి ఎన్నో రకాల ఆసక్తికరమైన వార్తలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో ఈ చిత్రం ప్రారంభానికి ముందే దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోతోంది. ఫలితంగా అప్పుడే ఈ చిత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తూ హైలైట్ అవుతోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా కాస్టింగ్ గురించి కూడా చాలా రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులో మరో హీరో కూడా నటిస్తున్నట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

  ఏకంగా టాప్‌ను విప్పేసిన ప్రియాంక చోప్రా: అబ్బో ఆమె ఫోజు చూశారంటే!

  త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో మహేశ్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే నటీనటుల వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించి.. ఇటీవలే 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీతో రీఎంట్రీ ఇచ్చిన వేణు తొట్టెంపూడిని ఓ కీలకమైన పాత్ర కోసం తీసుకున్నారని తెలిసింది. త్రివిక్రమ్‌కు ఎంతో సన్నిహితుడైన ఈ సీనియర్ హీరోకు ఇందులో అదిరిపోయే పాత్రను రాశాడని తెలుస్తోంది. తన ఫ్రెండ్ అయిన సునీల్‌ కోసం ఆయన ఎంతటి కేర్ తీసుకుంటూ ఉంటాడో.. ఇప్పుడు వేణును కూడా అదే రీతిలో చూపించబోతున్నాడని తెలిసింది.

  ఈ భారీ బడ్జెట్ సినిమాలో మహేశ్ బాబు రా ఏజెంట్‌గా కనిపిస్తాడని అంటున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ప్రియాంక మోహన్‌ను కూడా కీలక పాత్ర కోసం తీసుకున్నారని అంటున్నారు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ మూవీకి 'పార్థు', 'అతడే పార్థు', 'అర్జునుడు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించబోతున్నాడు.

  English summary
  Mahesh Babu Announce his 28 film with Trivikram Srinivas. Venu Thottempudi to Play Negative Role in This Movie
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X