Jr.NTR పుట్టుకలో దోషం.. 2030 వరకు ఆ పని చెయొద్దు.. మరో బాంబు పేల్చిన వేణు స్వామి

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సెలబ్రెటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వేణు స్వామి జూనియర్ ఎన్టీఆర్ జాతకంలో దోషం ఉందంటూ బాంబు పేల్చాడు. ఆయన పుట్టుకలోనే దోశం ఉందని.. చెప్పిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అయితే వేణు స్వామి.. జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సెలబ్రెటీ జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యారు. నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకున్నాక... వీరు విడిపోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వీరు విడిపోవడం.. తాను చెప్పిన వ్యాఖ్యలు నిజం కావడంతో ఒక్కసారిగా స్టార్ జోతిష్కుడు అయిపోయాడు. ఇక వేణు స్వామి చేత స్టార్ హీరోలు, హీరోయిన్లు పూజలు కూడా చేయించుకుంటారు.

VenuSwamy Sansational Comments on Junior NTR Astrology News Goes Viral

ఇక ఇదిలా ఉంటే... వేణు స్వామి ఎప్పటినుంచో జూనియర్ ఎన్టీఆర్ జాతకాన్ని చెప్పుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు రాజయోగం పట్టబోతుంది అని కొన్ని ఇంటర్వ్యూలలో బయటపెట్టారు కూడా. అయితే ఆయన పుట్టుక గురించి ఆయన పుట్టుకలో ఉన్న దోషం గురించి ఎన్టీఆర్ తల్లి శాలిని గారితో ఒక సంచలన విషయం బయట పెట్టారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ వీడియోలో వేణు స్వామి మాట్లాడుతూ... తనని ఎన్టీఆర్ తల్లి శాలిని తిరుమల తిరుపతి దేవస్థానంలో కలిశారని చెప్పుకువచ్చారు. అలా కలిసిన సమయంలో తారక్ జాతకం గురించి ఆమెకు సంచలన విషయాలు చెప్పగా... అప్పుడు తారక్ జాతకం గురించి ఆమె నన్ను ఒక ప్రశ్న అడిగిందని చెప్పుకువచ్చారు.

మీరు తారక్ జాతకం పూర్తిగా తెలియకుండానే ఆయన జాతకం బాగుంది అని చెబుతున్నారు.. కానీ వాడి జాతకంలో ఓ దోషం ఉంది అనేది మర్చిపోయారా అని శాలిని వేణు తనను ప్రశ్నించారట. దానికి తాను ఆయన జాతకం పూర్తిగా నాకు తెలుసు అని చెప్పుకువచ్చినట్లు తెలిపారు. ఎన్టీఆర్ పుట్టుకలో ఉన్న దోషం గురించి కూడా నాకు తెలుసమ్మా అని చెప్పినట్లు తెలిపారు.

VenuSwamy Sansational Comments on Junior NTR Astrology News Goes Viral

తాను చెప్పిన దానికి ఆమె ఆశ్చర్యపోయి ఎన్టీఆర్ జాతకంలో ఉన్న దోషం కేవలం నాకు,ఎన్టీఆర్ కి,పెద్ద ఎన్టీఆర్ కి మాత్రమే తెలుసు.కానీ మీకు ఎలా తెలిసింది అని అడిగిందని చెప్పుకువచ్చారు. దానికి నాకు అన్ని తెలుస్తాయి అమ్మా అని వేణు స్వామి చెప్పారట. తారక్ ది కూడా జయలలిత జాతకమే.. ఇద్దరిది ఒకటే నక్షత్రం... ఆయన కూడా రాజకీయాల్లో రాణిస్తారని చెప్పుకువచ్చారట.

అయితే 2030 వరకు ఆయనను రాజకీయాల్లోకి రానివ్వకండి అని నేను శాలిని గారితో చెప్పాను.. అంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు. అయితే తారక్ పుట్టుకలో ఉన్న ఆ దోషం ఏంటో మాత్రం వేణు స్వామి బయట పెట్టలేదు కానీ.. ప్రస్తుతం ఆ దోషం ఏంటి.. దాని వల్ల ఎలాంటి ప్రమాదం రానుందని అంతా అనుకుంటున్నారు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X