ఇంతకీ పవన్ కళ్యాణ్ ‘పంజా’ ఎలాంటి సినిమా..!?
సాధారణంగా సినిమా పబ్లిసిటీ లక్ష్యాలు రెండు. మొదటిది ఈ సినిమా రాబోతుంది అని తెలియ చెప్పడం. రెండవది ఈ రకమైన సినిమాకు ప్రిపేర్ అవ్వండి అని చెప్పడం. మొదటి లక్ష్యంలో భాగంగా మా సినిమా త్వరలో రోబోతుందని 'పంజా" నిర్మాతలు పబ్లిసిటీ బాగా చేస్తున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేలా చేయగల్గారు.
కాగా రెండో లక్ష్యం మా సినిమాలో ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చే అంశాలు ఇలా వుండబోతున్నాయి అని ఇంకా చెప్పలేదు.మాములుగా సినిమా అనేది వ్యాపారం కాబట్టి, పబ్లిసిటీలో రెండో లక్ష్యాన్ని నిర్మాతలు నిజాయితీగా చెప్పడం చాలా రేర్ గా జరుగుతూ వుంటుంది. ఏ మాత్రం తేడా జరిగినా ఓపినింగ్స్ గల్లంతైపోతాయి. చాలా కేర్ ఫుల్ గా ప్లాన్ చెయ్యాలి.
ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టైటిల్, స్టిల్స్ ను బట్టి చూస్తే సినిమా ఎలా వుంటుందో అసలు ఐడియా రావడం లేదు. పాటలు, ట్రైలర్స్ రిలీజ్ అయ్యాక అయినా వస్తుందనేది కూడా డౌటే అని అభిమానులు కన్ఫ్యూజన్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ డైరెక్టోరియల్ మూవీ 'జానీ". ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది కానీ ఈ చిత్రం ట్రేడ్ వర్గాల్లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ మూవీ విడుదల టైమ్ లో ఈ చిత్రం లోగోతో టీషర్ట్స్, క్యాప్స్, బెల్ట్స్ బైటికొచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఇదే తరహాలో పవన్ నటిస్తున్న 'పంజా చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోతో టీషర్ట్స్, క్యాప్స్, బెల్ట్స్, బైటకి రాబోతున్నాయి. విడుదలకు ముందే తెగ హడావిడి చేస్తున్న పవన్ 'పంజా" దెబ్బకు బాక్సాఫీస్ ఎలా ఉంటుందో తెలియాలంటే డిసెంబర్ వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications










