ఆమెతో డాన్స్ చేయడానికి నానా తంటాలు పడుతున్నయంగ్ హీరో...
కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ చెన్నై, ముంబాయ్, హైదరాబాద్ ల మధ్య తెగ తిరుగుతూ తను చేస్తున్న సినిమాలతో చాలా బిజీగా వుంది. సిద్దార్థ హీరోగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న 'అనగనగగా ఒక ధీరుడు" పాటల చిత్రీకరణ కోసం శృతి ప్రస్తుతం టర్కీలో వుంది. పాటల్లో శృతితో కలిసి డాన్స్ చెయ్యాలంటే సిద్దార్థకు ప్రాణం మీదకు వస్తోందట. శృతి శిక్షణ పొందిన డాన్సర్ కావడంతో డాన్స్ మూమెంట్స్ లో ఆమెను అందుకోవడానికి సిద్దార్థ చాలా కష్టపడాల్సి వస్తోంది. సాంగ్స్ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నాడట. 'నిజంగా శృతి అమేజింగ్ డాన్సర్. ఆమెతో కలిసి వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా వుంది. నేను డాన్స్ విషయంలో కొంత ఇబ్బంది పడ్డప్పటికీ ఓ అద్బుతమైన సినిమాలో నటిస్తున్నానన్న ఆనందంతో నా కష్టాన్ని మర్చిపోతున్నాను" అంటున్నాడు సిద్దార్థ.


Click it and Unblock the Notifications











