సినిమానే రిలీజ్ కాలేదు.. అప్పుడే సీక్వల్ టాక్!! మరీ ఇంత క్రేజా? వెరీ ఇంట్రెస్టింగ్..
ఓ సినిమా రిలీజ్ అయి సక్సెస్ అయితేనే దానికి సీక్వల్ తీసి క్యాచ్ చేసుకోవాలని చూస్తుంటారు దర్శకనిర్మాతలు. కానీ మన నాచురల్ స్టార్ నాని సినిమా విషయంలో అందుకు భిన్నంగా మూవీ రిలీజ్‌కి ముందే సీక్వల్ టాక్ రావడం ఆశ్చర్యపరుస్తోంది. తాజా సమాచారం మేరకు నాని లేటెస్ట్ మూవీ 'V'కి సీక్వల్ కూడా రానుందని తెలుస్తోంది.
మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న విలక్షణ కథాంశం V. సింగల్ అక్షరంలో ఇలా ఆసక్తికర టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. పైగా నాని కెరీర్‌లో ఇది ఓ డిఫెరెంట్ మూవీగా రానుందని వచ్చిన వార్తలు సినిమా పట్ల ఆతృతను పెంచేశాయి. ఇక ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్స్, టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.

చిత్రంలో నాని, సుధీర్‌బాబు హీరోలుగా నటిస్తుండగా.. నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నాని కెరీర్‌లో 25వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేయాలనుకున్నారు కానీ.. దేశంలో కరోనా విజృంభణ కారణంగా వాయిదా వేయడం జరిగింది.
ఇకపోతే విడుదలకు ముందే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని వార్తలు వస్తుండటం విశేషం. సినిమా క్లైమాక్స్‌ను సీక్వెల్ ఉంటుందనే అర్థం వచ్చేలా డిజైన్ చేశారని ఇన్‌సైడ్ టాక్. సో.. చూడాలి మరి దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందనేది.


Click it and Unblock the Notifications











