వైష్ణవ్ తేజ్ 'కొండపొలం'కు ఇప్పట్లో మోక్షం లేనట్టే.. వాళ్ళు చేతులు ఎత్తేయడంతో!

చేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ అందుకొని భారీ కలెక్షన్స్ కూడా సాధించారు. అయితే ఈ సినిమా రిలీజ్ కావడానికి ముందు ఆయన క్రిష్ దర్శకత్వంలో కొండపొలం ఒక సినిమా చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి రిలీజ్ కి కూడా సిద్ధంగా ఉందని ప్రచారం జరుగుతూ వస్తోంది. ఉప్పెన సినిమాకు వచ్చిన క్రేజ్ దృష్ట్యా సినిమాను తమకు అమ్మమని చాలా ఓటీటీ సంస్థలు క్రిష్ ను సంప్రదించినట్లు కూడా ప్రచారం జరిగింది.

కానీ నిజానికి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది, పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఎందుకంటే పూర్తిగా అడవి నేపథ్యంలో సాగే ఈ కథ లో జంతువుల్నీ, అడవి వాతావరణాన్ని సృష్టించడానికి వీఎఫ్ఎక్స్ చాలా కీలకం అని అంటున్నారు. సినిమా షూటింగ్ చాలా తక్కువ రోజుల్లోనే అవగోట్టారు కానీ సినిమా రిలీజ్ చేయాలంటే దాదాపు 80 శాతం పని వీఎఫ్ఎక్స్ కంపెనీల మీదే ఆధార పడి ఉందని అంటున్నారు.

VFX tension for Kondapolam cinema

సినిమా ప్రారంభంలోనే పని అప్పజెప్పినా ఈ డిసెంబర్ వరకు వర్క్ పూర్తి చేసి ఇవ్వలేమని సదరు వీఎఫ్ఎక్స్ చేతులెత్తేశాయి అని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్ రిలీజ్ కూడా కష్టం కాబట్టి క్రిష్ సరే అన్నారు అని అంటున్నారు. మొదటి వేవ్ లాక్ డౌన్ తర్వాత ఇచ్చిన సడలింపుల్లో కోవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ వికారాబాద్ అడవుల్లో ఈ చిత్రం షూటింగ్ ను కేవలం 45 రోజుల సింగిల్ షెడ్యూల్ లో క్రిష్ పూర్తిచేశారు. సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె ఓబులమ్మ అనే పాత్రలో ఆమె మేకప్ లేకుండా నటించిందని టాక్. మరి చూడాలి ఈ సినిమా ఎప్పటికి రిలీజ్ అవుతుందో మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X