Katrina Kaif ఇండస్ట్రీకి మరో బుల్లి వారసుడు - 40ఏళ్ల వయసులో తల్లికాబోతున్న కత్రినా కైఫ్?
టాలీవుడ్ మల్లీశ్వరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ త్వరలో తల్లిగా ప్రమోషన్ అందుకోనుందా? ఆమె ప్రస్తుతం గర్భంతో ఉందా? అంటే అవుననే సమాధానం బాలీవుడ్ మీడియా నుంచి వినిపిస్తోంది. విక్కీ కౌశల్- కత్రిన ఇంటికి త్వరలోనే మరొకరు రానున్నారంటూ అభిమానులు, నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు. దాని గురించే ఈ కథనం.
బాలీవుడ్‌లో పలువురు స్టార్ హీరోలతో లవ్‌ట్రాక్‌లు నడిపిన హీరోయిన్ కత్రినా కైప్. కండల వీరుడు సల్మాన్ ఖాన్, చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌తో ఆమె ప్రేమాయణం నడిపింది. కానీ అవి బ్రేకప్ అయిపోయాయి. ఏమైందో ఏమో కానీ వారిని దూరం పెట్టేసింది. ఆ తర్వాత విక్కీ కౌశల్‌తో సహజీవనం చేసి ఎలాంటి హడావుడీ లేకుండా పెళ్లి చేసుకుంది. రాజస్థాన్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి వివాహ వేడుక జరిగిపోయింది.

అయితే కత్రినాకు పెళ్లి అయి దాదాపు రెండేళ్లు గడుస్తోంది. దీంతో ఆమె ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందా అని చాలా మంది అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. పలుసార్లు ఈమె ప్రెగ్నెంట్ అయిందని వార్తలు కూడా వచ్చాయి. ఆమె పిక్స్‌లోని పొట్టను చూస్తూ గర్బం దాల్చిందంటూ కథనాలు రాసుకొచ్చారు. అయితే మళ్లీ ఆమె ప్రెగ్నెంట్ న్యూస్ తెరపైకి వచ్చింది
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ - వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని జామ్‌నగర్ వేదికగా అట్టహాసంగా జరిగింది. ఇక్కడికి బాలీవుడ్ తారాగాణం అంతా కదిలి వెళ్లింది. ఇందులో భాగంగానే కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ కూడా జంటగా అక్కడికి వెళ్లి హాజరయ్యారు. అయితే ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో కత్రిన ప్రతిసారి తన పొట్టను దుపట్టాతో పదే పదే దాచుకుంటూ కెమెరా కంటికి కనిపించింది.
దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కత్రినా గర్భంతో ఉందని, అందుకే ఆమె బేబీ బంప్‌ను కనిపించకుండా దాచుకుంటోందని చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతూ అభిప్రాయపడుతున్నారు. ఆ ఫొటోలకు లైక్స్ కొడుతూ కామెంట్లు పెడుతూ తెగ షేర్ చేస్తున్నారు.

రీసెంట్గా బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మ కూడా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇంకా మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌లో డెలివరీ అని చెప్పింది. ఇప్పుడు కత్రినా కూడా శుభవార్త చెబుతుందని అంతా ఆశిస్తున్నారు. మరి ఈ చక్కర్లు కొట్టే వార్తల్లో నిజం ఎంతో తెలీదు. దీనిపై స్పష్టత రావాలంటే విక్కీ కౌశల్ లో ఒకరు స్పందించాల్సిందే. కాగా, కత్రినా ఈ మధ్యే విజయ్ సేతుపతితో కలిసి మెరీ క్రిస్మస్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కంటెంట్ పరంగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకోలేకపోయింది.


Click it and Unblock the Notifications











