శంకర వరప్రసాద్ గారుతో పెరిగిన వెంకటేష్ రెమ్యునరేషన్.. త్రివిక్రమ్‌తో మూవీకి ఎన్ని కోట్లంటే?

టాలీవుడ్ సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ మంచి జోష్‌లో ఉన్నారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ కొట్టిన వెంకీ మామ.. సీనియర్ హీరోలలో తొలిసారిగా 300 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన తొలి హీరోగా నిలిచారు. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారులో గెస్ట్ రోల్ పోషించారు వెంకటేష్. తద్వారా కెరీర్‌లో వరుసగా మరో రెండో 300 కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. దాంతో వెంకీ మామ రేంజ్‌ మారిపోతోంది. తాజాగా ఆయన తన రెమ్యునరేషన్‌ను కూడా పెంచినట్లుగా గాసిప్స్ వస్తున్నాయి.

సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ గారు మూవీలతో వెంకటేష్ సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: AK 47 అనే సినిమా చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్న కాంబినేషన్. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఇది వర్కౌట్ కాలేదు. అయితే ఇన్నేళ్ల తర్వాత వెంకీ - త్రివిక్రమ్ కాంబోలో మూవీలో సెట్ కావడంతో ఇండస్ట్రీలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వెంకటేష్ కెరీర్‌ ఈ స్థాయికి రావడంలో త్రివిక్రమ్ గతంలో కీలక పాత్ర పోషించారు.

Victory Venkatesh Raises Remuneration After Back-to-Back Hits Trivikram Film Creates Buzz

గతంలో మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ తదితర సినిమాలలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్.. వాటికి వెంకీ మార్క్ డైలాగ్ డెలివరితో జనాన్ని కడుపుబ్బా నవ్వించారు. ఈ డైలాగ్స్ కూడా ఆ సినిమాలు హిట్ కావడానికి కారణమయ్యాయి. అప్పటికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ రైటర్ మాత్రమే. ఆ సమయంలోనే వెంకీ మామతో త్రివిక్రమ్ సినిమా తీస్తారని వార్తలు వచ్చాయి. అయితే అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఇన్నాళ్ల తర్వాత వెంకీ మామను డైరెక్ట్ చేసే అవకాశం త్రివిక్రమ్‌కి దక్కింది.

ఈ సినిమాకు సంబంధించి రోజుకొక అప్‌డేట్ వస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్, నేహా శెట్టి, శ్రీనిధి శెట్టితో పాటు పలువురి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టిని ఫైనల్‌గా హీరోయిన్‌గా ఫిక్స్ చేశారని టాక్. ఆదర్శ కుటుంబం మూవీని ఈ ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

గతంలో వెంకటేష్ రెమ్యునరేషన్ 10 కోట్ల లోపే ఉండేది. అయితే వరుసగా రెండు సినిమాలు హిట్ రావడంతో వెంకటేష్ పారితోషికం భారీగా పెంచేశారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు వెంకటేష్ దాదాపు 30 నుంచి 35 కోట్ల రూపాయల రేంజ్‌లో పారితోషికంగా తీసుకున్నారు. తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో 20 నిమిషాల పాత్రతో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ చిన్న రోల్ కోసం వెంకటేష్ దాదాపు 16 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకున్నారని ఫిలింనగర్ టాక్.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆదర్శ కుటుంబం మూవీకి వెంకీ మామ పారితోషికాన్ని బాగా పెంచేశారని అంటున్నారు. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు వెంకటేష్ 40 కోట్ల రేంజ్‌లో పారితోషికం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: victory venkatesh trivikram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X