బావలు సయ్యా: సిల్క్ స్మిత జీవిత రహస్యం!
బావలు సయ్యా అంటూ టాలీవుడ్ని అలరించి ఆకులు మేయించిన ఒకప్పటి మేటి ఐటమ్ గాళ్ సిల్క్ స్మిత. హీరోయిన్ వేషాలకోసం వచ్చిన విజయలక్ష్మీ ఇక్కడ పోటీలో స్మిత గా మారి వ్యాంప్ పాత్రలలో తనదైన ముద్రవేసి ఆ తర్వాత అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడింది. తన మేని ఊపులతో టీనేజి కుర్రాళ్ళ నుండి తాతల దాకా అందరికీ రిమ్మతెగులు పుట్టించిన ఆ మేటి ఐటమ్ గాళ్ ని తెలుగు పరిశ్రమ పట్టించుకోక పోయినా బాలీవుడ్ మాత్రం గుర్తించింది.
సిల్క్ స్మిత జీవిత చరిత్రను తెరకెక్కించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. బాలీవుడ్లో సంచలన దర్శకురాలు, నిర్మాత ఏక్తాకపూర్ ఈ సినిమాను పిక్చర్ పేరుతో తెరకెక్కించనుందని తెలుస్తున్నది. దీనికి సంబందించిన స్ర్కిప్ట్ పూర్తి కావస్తోందని మరయు ఈ చిత్ర టైటిల్ ను 'ది డర్టీ పిక్చర్" గా రూపొందుతుందని సమాచారం. ఈ చిత్రంలో సిల్క్ స్మిత క్యారెక్టర్ ను విద్యాబాలన్ లేక మల్లికా షరావత్ పోషించనున్నట్టు సమాచారం. కథా పరంగా ఇందులో అసలు పరిశ్రమలో హీరోయిన్స్ గా అవకాశాల కోసం వచ్చి ఆ తర్వాత వయసు, వేడి అంతా అందలం కోసమో, అవాకాశాలకోసమో అర్పించి చివరకు పాతాళానికి పడిపోయే ఎందరో అభాగినుల వ్యధా భరిత గాధను చూపటం ముక్య ఉద్దేశ్యమని ఏక్తాకపూర్ పేర్కొంటున్నారు.
ఈ చిత్రంలో అసలు సిల్క్ స్మిత సినీ రంగ ప్రవేశం, ఆతర్వాత ఆమె జీవిత గమనం, తర్వాత రెండో పెళ్ళి వాడిని పెళ్ళిపేరుతో అట్టిపెట్టుకోవటం చివరకు నమ్మిన వాడే నాటకీయ పరిణామాల మధ్య స్మిత ఆత్మహత్యను మీడియాకి తెలియజేయటం అన్నీ ఇందులో ఉంటాయట. అసలు ఆమె ఆత్మహత్య చేసుకుందా?లేక ఇది హత్యా? ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలు ఏమిటి? ఆందోళనా! పరిశ్రమలో ఉన్న అవకాశ వాదమా లేక ఆశించిన అందలం అందక విలువైన జీవితం చాలించిందా అన్నవి ఇందులో ప్రధాన అంశాలుగా చెప్పవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications