విద్యాబాలన్,ప్రభాస్ గెస్ట్ లుగా ఆడియో పంక్షన్...
అలాగే విద్యాబాలన్‌తో పాటు మరో అతిథిగా ప్రభాస్ కూడా ఈ వేడుకకు హాజరవ్వనున్నారని సమాచారం. ఈ సందర్భంగా సహ నిర్మాత సత్య ముమ్మడి మాట్లాడుతూ-''ప్రియమణి కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా ఇది. అశోక్‌గజపతిరాజుగా కృష్ణంరాజు పాత్ర ఈ చిత్రానికి హైలైట్. మరో శక్తిమంతమైన పాత్రలో తమిళ హీరో శరత్‌కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ దాదాపు పూర్తికావచ్చింది. సినిమా సాధించబోయే విజయానికి ప్రతీకగా ఆగస్ట్ 12న ఆడియో జరుపనున్నాం'' అని తెలిపారు.
వి.సముద్ర దర్శకత్వంలో డా.శ్రీనుబాబు.జి నిర్మిస్తున్న 'చండి' చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎస్.ఆర్.శంకర్, చిన్న సంయుక్తంగా స్వరాలందించిన ఈ చిత్రం పాటలను గ్రాండ్‌గా విడుదల చేయడానికి నిర్మాత శ్రీనుబాబు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రియమణి ప్రధాన పాత్రలో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో...ఆశిష్ విద్యార్థి, వినోద్‌కుమార్, నాగబాబు, అలీ, రంగనాథ్, పోసాని తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: కరణం పి.బాబ్జీ, సమర్పణ: జి.జగన్నాథనాయుడు.


Click it and Unblock the Notifications












