twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెట్ లోకి హఠాత్తుగా ప్రత్యక్షమైన తండ్రిని చూసి షాక్ తిన్న డర్టీ హీరోయిన్..?

    By Sindhu
    |

    పద్దతిగా ఎన్ని సినిమాలు తీసినా రాని పబ్లిసిటీ విద్యాబాలన్ కు ఒక్క సినిమాతో వచ్చేసింది. గత పదేళ్ళ నుంచి బాలీవుడ్ లో ఉన్నా, అవార్డ్ ఫెర్ ఫార్మేన్స్ లు ఇచ్చినా దక్కని ఇమేజ్ ఇప్పుడు సొంతమవుతుంది. అలనాటి సౌత్ హాట్ నటి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న డర్టీ పిక్చర్ కు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. డర్టీ పిక్చర్ ఓపెనింగ్ నుంచి, పోస్టర్ మేకింగ్, స్టిల్స్, ప్రోమో ఇలా డర్టీ పిక్చర్ గురుంచి ఏమి వచ్చినా ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ దక్కుతుంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో తన రేంజ్ పెంచుకోవాలని కూడా విద్యాబాలన్ అనుకుంటుందట. డర్టీ పిక్చర్ ప్రోమో,పోస్టర్ మేకింగ్ తరువాత ఇప్పుడు మరో సాంగ్ రిలీజ్ చేశారు.

    కాగా ఇదిలా ఉంటే డర్టీ పిక్చర్ పోస్టర్స్ 'నిజంగానే డర్టీగా ఉన్నాయి. బాలన్‌కి ఇంత తెగింపు ఎక్కడ్నుంచి వచ్చింది" అంటున్నారు విద్యాబాలన్ నటిస్తున్న 'ది డర్టీ పిక్చర్" చిత్రానికి సంబంధించిన ఫొటోలు చూసిన బాలీవుడ్‌వారు. హోమ్లీ ఇమేజ్‌ ని పూర్తిగా పక్కన పెట్టేసి.. ఈ చిత్రంలో సిల్క్‌స్మిత పాత్రలో విద్యా రెచ్చిపోయి హాట్ హాట్‌ గా నటిస్తున్నారు. ఈ చిత్రంతో తనకు గ్లామర్ ఇమేజ్ రావడం ఖాయం అని కూడా సంబరపడిపోతున్నారామె. ఇలా ఎంతో ఇష్టపడి స్మిత పాత్రను చేస్తున్న విద్యాకి ఓ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.

    ఇటీవల ముంబయిలోని మెహబూబ్ స్టూడియోస్‌ లో విద్యాబాలన్ పాల్గొనగా ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె తండ్రి సెట్లోకి ఎంటరయ్యారట. ఈ సన్నివేశంలో భాగంగా సిగరెట్ మీద సిగరెట్ కాల్చుతున్న విద్యా... హఠాత్తుగా ప్రత్యక్షమైన తండ్రిని చూసి ఖంగు తిన్నారట. ఒంటి మీద అరకొర దుస్తులు ఉండటమే కాకుండా, చేతిలో సిగరెట్ సహా తండ్రి ముందు కనిపించాల్సిన పరిస్థితి నెలకొనడంతో విద్యా మొహం కందగడ్డలా మారిందని, తండ్రి వైపు చూడకుండా దిక్కులు చూస్తూ నిలబడ్డారని సమాచారం.

    కూతురి అవస్థ చూసి, ఆ తండ్రిగారు అక్కడ్నుంచి నిష్ర్కమించి, వానిటీ వ్యాన్‌లో కూర్చుండిపోయారట. ఆ తర్వాతనే సదరు సన్నివేశంలో నటించారట విద్యాబాలన్. అంతా బాగానే ఉంది.. మరి, రేపు విద్యాబాలన్ తండ్రి 'ది డర్టీ పిక్చర్"ని చూస్తారు కదా.. అప్పుడు ఏమీ ఫీలవ్వరా? అని ఈ చిత్రం యూనిట్ సభ్యులు చెవులు కొరుక్కుంటున్నారట.

    English summary
    In the upcoming much-awaited flick, ‘The Dirty Picture’, the voluptuous-seductress-steamy-dusky beauty of Hindi cinema trade Vidya Balan is playing the role of the south sensation Silk Smitha. Balan drops down all of her shyness to portray this character with much conviction and ease.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X