‘డర్టీ హీరోయిన్’ పై బడాదర్శకనిర్మాతల కళ్ళు...?

By Sindhu

కుటుంబ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన మంచి నటిగా పేరు తెచ్చుకున్న విద్యాబాలన్, 'డర్టీ పిక్ఛర్" తో హాట్ కు హాట్ సుందరిగా మారిపోయింది. ఈ చిత్రంలో విద్యా చేసే అందాల ప్రదర్శన అంతా ఇంతా కాదు. కుర్రకారుకు దిమ్మగతిరిగే విధంగా అందాల ఆరబోత ప్రదర్శించేసిందట. అయితే ఈ చిత్రం విడుదలై విజయం సాధిస్తుందో లేక పరాభవం ఎదుర్కొంటుందో అన్న విషయం పక్కన పెడితే...ఈ చిత్రం తర్వాత విద్యా నటించబోయే సినిమాలకు 5 కోట్లకు రెమ్యునరేషన్ పెంచేసింది.

అయితే విద్యా ఈ విధంగా రెమ్యునరేషన్ పెంచే సరికి కొంత మంది నిర్మాతలు భయంగానే ఉన్నా మిగతా నిర్మాతలు మాత్రం మాకు విద్యా అవసరం లేదనే ఉద్దేశ్యంతో ఉన్నారు. మరి విద్యా రెమ్యునరేషన్ నచ్చినవాళ్లు వెంటనే వెళ్లి విద్యా డేట్స్ తీసుకుంటే మంచిది. 'డర్టీ పిక్చర్" విడుదలయ్యాక వెళ్తే రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశం ఉంది. విద్యా బాలన్ గ్లామర్ ప్రదర్శన దెబ్బకు ఇటు బాలీవుడ్డే కాదు అటు టాలీవుడ్ అండ్ కోలీవుడ్ ఫ్లాటై పోయాయి. విద్యాబాలన్ తన 'డర్టీ పిక్చర్"తో ఒక్కసారిగా అందాలను బట్టబయలు చేసి అందరి దృష్టిని ఆకర్షించేసింది.

అంతేకాదండోయ్.. అవసరమైతే టాప్‌ లెస్‌ గా కూడా నటిస్తానని చెప్పిందట. దీంతో ఇపుడు బాలీవుడ్ సంగతేమోగానీ కోలీవుడ్, టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమె కాల్షీట్లకోసం ఎగబడుతున్నారట. కొందరు అగ్రశ్రేణి దర్శకనిర్మాతలకు విద్యా బాలన్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందట. మొత్తమ్మీద మన టాలీవుడ్ సిల్క్ స్మిత పుణ్యమా అని విద్యా బాలన్ కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. సిల్క్ స్మితకు ఇంత క్రేజ్ ఉన్న సంగతి బాలీవుడ్ ఏక్తా పసిగట్టింది కానీ మన టాలీవుడ్ నిర్మాతలు పసిగట్టలేకపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X