టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉన్న హీరోయిన్ ‘టాప్ లెస్ స్టేట్ మెంట్’...!?
బాలీవుడ్ లో సంప్రదాయబద్దమైన పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచిన ఈ ముద్దుగుమ్మ నోటి వెంట ఇలాంటి వ్యాఖ్య వెలువడటంతో అవాక్కవ్వడం బాలీవుడ్ వంతైంది. సిల్క్ స్మిత జీవిత కథతో రూపొందుతోన్న 'డర్టీ పిక్చర్"లో నటిస్తూ ఇప్పటికే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు విద్యాబాలన్. ఇప్పుడు ఈ 'టాప్ లెస్" స్టేట్‌మెంట్ తో అక్కడ మళ్లీ పెను దుమారాన్నే రేపారామె. ఇదంతా 'డర్టీ పిక్చర్" ప్రభావమే అని బాలీవుడ్ లో పలువురు చెవులు కొరుక్కుటుంటే..'మితిమీరిన ఎక్స్ పోజింగ్ కన్నా, న్యూడిటీ తప్పేం కాదు" అంటూ ఘాటైన స్టేట్ మెంట్లు ఇచ్చేశారు విద్యాబాలన్.
ఇటీవల ఓ సోప్ యాడ్ కోసం టాప్ లెస్‌గా (వీపు భాగం కనిపించే విధంగా) నటించారామె. అలా నటించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా విద్య పై రీతిలో స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ..'పాత్ర కోసం ఎంతటి త్యాగానికైనా నటి వెనుకాడకూడదు. నేను ఓ పాత్రను ఇష్టపడితే… ఆ సినిమాలో కళాత్మకవిలువలుంటే, పూర్తిగా టాప్ లెస్‌గా కనిపించడానికి కూడా వెనుకాడను. అయితే సెన్సార్ వాళ్లు కూడా ఒప్పుకోవాలి" అంటూ తనదైన శైలిలో నవ్వేశారు. మనదేశంలో విలువలతో పాటు కొన్ని పరిధిలూ ఉన్నాయి.
అలా కనిపిస్తే ఇక్కడ సంస్కారం అనిపించుకోదు కదా… అనంటే…'చూడండీ… హాలీవుడ్ సినిమాలు ఎంతో కళాత్మకంగా ఉంటాయి. అక్కడ కథానాయికలు కొన్ని సందర్భాల్లో పూర్తి న్యూడ్ గా కనిపిస్తారు. అందుకని వాటిని వల్గర్ సినిమాలు అనలేం. తాము ఏం చెప్పాలనుకున్నారో అది కరాఖండిగా చెబుతారు కాబట్టే అక్కడ నేటికీ గొప్ప సినిమాలు వస్తున్నాయి. మనలో కూడా మార్పు రావాలి. ఆ ట్రెండ్ ఇక్కడ కూడా రావాలి" అని బదులిచ్చారు విద్యాబాలన్.


Click it and Unblock the Notifications











