»   » డైరెక్టర్ తో హీరోయిన్ హాట్ హాట్ రొమాన్స్ ....

డైరెక్టర్ తో హీరోయిన్ హాట్ హాట్ రొమాన్స్ ....

Posted By:
Subscribe to Filmibeat Telugu

అలనాటి దక్షిణాది శృంగార తార సిల్క్‌స్మిత జీవిత గాథ ఆధారంగా బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ 'డర్టీ పిక్చర్" చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. విద్యాబాలన్ కథానాయికగా నటిస్తోంది. మిలాన్ లూథ్రియా దర్శకుడు. ప్రారంభం నుంచి పలు విశేషాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను ఇటీవలే రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు. ఎనభై దశకాల్లోని దక్షిణాది సినిమా పాటని ప్రతిబింబించేలా ఈ పాటలో కొన్ని వేల కమలాఫలాలను వాడారు. కథానాయిక విద్యాబాలన్ నర్తిస్తుండగా ఆ పండ్లు ఆమెపై దొర్లుతూ వెళ్లేలా నృత్యదర్శకురాలు పోనీవర్మ డాన్స్ సీక్వెన్స్‌ను కంపోజ్ చేసింది. ఈ పాట కోసం విద్యాబాలన్ చాలా శ్రమ పడాల్సివచ్చిందని నిర్మాత ఏక్తాకపూర్ తెలిపింది. ఈ చిత్రంలో దక్షిణాది సూపర్‌ స్టార్‌ గా నసీరుద్దీన్‌షా నటిస్తున్నాడు. కథానుగుణంగా ఆయన కూడా ఈ చిత్రంలో ఓ పాటకు డ్యాన్స్ చేయబోతున్నట్లు సమాచారం.

ఇంకా ఈ చిత్రంలో పలువురు హీరోలతో సాగించే శృంగార కేళి గురించి విడమరచి మరీ ప్రచారం చేస్తున్నారు. ఒక సన్నివేశంలో తుషార్ కపూర్ తో సెక్స్ సీన్లన్నీ పూర్తి కావడంతో ఇప్పుడు ఫోకస్ ఇమ్రాన్ హష్మీ మీదకి మళ్లింది. ఈ చిత్రంలో ఇమ్రాన్ ఓ సినీ డైరెక్టర్ పాత్ర పోషిస్తున్నాడు. స్మితతో చాన్నాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకున్న దర్శకుడి పాత్రని ఇందులో హైలైట్ చేస్తున్నారు. వీరిద్దరు లిప్ లాక్ సీన్స్ పండించలేదు, జీవించేశారంటున్నారు. వీరిద్దరి మద్య వచ్చే సన్నివేశఆలు చాలా చక్కగా కుదిరాయని, కెమిస్ట్రీ బాగా కుదిరిందని చిత్ర యూనిట్ అంటోంది.

English summary
Everybody knows that actress Vidya Balan is going to shed her cloths and show more skin for her role as Silk Smitha in her upcoming release The Dirty Picture but not many may know that she has a lip-locking scene in the film. We hear that she will kiss Emraan Hashmi, who has earned the title 'serial kisser' for kissing his co-stars.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu