‘డర్టీ పిక్చర్’ ఎంత డర్టీగా ఉందో..?
బాలీవుడ్ హీరోయిన్ విద్యాలన్ హీరోయిన్ గా 'డర్టీ పిక్చర్" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటలోని స్టిల్స్ నెట్లోకి విడుదలయ్యాయి. ఆ ఫోటోలు చూస్తుంటే ఈ సినిమా కేవలం పెద్దలకు మాత్రమే అన్న చందంగా ఉంది. కుటుంబ సభ్యులతో, చిన్న పిల్లలో కలిసి చూడ దగ్గ సినిమా కాదని అర్థం అవుతోంది. స్టిల్స్ లోని భంగిమలు రస హృదయులకు ఆనందాన్ని కలిగించొచ్చేమో గానీ....కుటుంబ సమేతంగా చూస్తే ఇబ్బంది తప్పదు.
అలనాటి శృంగార తార సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో స్మిత పాత్రను విద్యాబాలన్ పోషిస్తుండగా, నసీరుద్దీన్‌షా, తుషార్‌కపూర్, ఇమ్రాన్ హస్మీ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్‌షా ఇందులో సూపర్ స్టార్ గా వయసు మీరిన కథానాయకుడి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఆయన చేసే పాత్ర సిల్మ్ స్మితతో 'సం"బంధం పెట్టుకున్న ఓ స్టార్ నటుడిది అని సినీ వర్గాల భోగట్టా. డిసెంబర్ నెలలో సిల్క్ స్మిత పుట్టిన రోజున ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. హిందీతో పాటు, దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మరికొన్ని రోజుల్లోనే డర్టీ పిక్చర్ ట్రైలర్స్ టీవీల్లో సందడి చేయనున్నాయి.


Click it and Unblock the Notifications











