RRR: వరుస ఈవెంట్లతో బోర్ కొట్టిస్తున్న RRR త్రయం.. మరీ ఇంతలానా?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం RRR. తెలుగులో రెండు పెద్ద కుటుంబాలకు చెందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా కోసం ఇద్దరు హీరోల అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం రాజమౌళి సహా రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేస్తున్నారు. అయితే అదే ఇప్పుడు అభిమానులకు బోర్ గా మారిందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

పాన్ వరల్డ్ లెవల్లో

పాన్ వరల్డ్ లెవల్లో

రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ కథానాయికలు. అజయ్​ దేవ్ గన్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్నా సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మార్చి 25న పాన్ వరల్డ్ లెవల్లో గ్రాండ్‎గా విడుదల కాబోతుంది.

వరుస టూర్లు

వరుస టూర్లు


ఈ క్రమంలోనే 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా ప్రమోషన్స్ కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే చెన్నై, ముంబయి, కేరళ, హైదరాబాద్‌లో పలు ప్రెస్‌మీట్స్‌, ప్రీ రిలీజ్‌ ఈవెంట్లను నిర్వహించగా విడుదల సమయం దగ్గరపడటంతో మరికొన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తోంది. 6 రోజుల సమయంలో 9 నగరాల్లోని సినీ ప్రియులను కలుస్తోంది.18న దుబాయ్‌లో ఈవెంట్ నిర్వహించగా, 19న బెంగళూరు, చిక్ బళ్లాపూర్, 20న బరోడా, ఢిల్లీ, 21న అమృత్‌సర్‌, జైపుర్‌, 22న కోల్‌కతా, వారణాసి, 23న హైదరాబాద్‌లో ఈవెంట్ లు జరపనుంది.

ఏం చెప్పాలో అర్ధం కాక

ఏం చెప్పాలో అర్ధం కాక


అయితే RRR త్రయం రామారావు, రాజమౌళి మరియు రామ్ చరణ్ RRR ప్రమోషన్‌లకు ముఖమైన ఫేసులుగా మారారు, ఎక్కడ చూసినా ఈ ముగ్గురూ ఇంటర్వ్యూల జోరుతో కనిపిస్తున్నారు. అయితే ఇంటర్వ్యూలన్నీ కాస్త ఓవర్‌బోర్డ్‌గా మారుతున్నాయని ఓ వర్గం ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీని వెనుక కారణం అన్ని ఇంటర్వ్యూలలో, రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ పదేపదే రాజమౌళిని ప్రశంసించడమే అని అంటున్నారు. తమను హీరోలుగా ఎంచుకున్నందుకు కృతజ్ఞతతో ఆలా చెబుతున్నారో లేక నిజంగా ఏం చెప్పాలో అర్ధం కాక ఇలా చెబుతున్నారో ఎవరూ చెప్పలేని పరిస్థితి.

 హడావుడి మాత్రం

హడావుడి మాత్రం


స్టార్ హీరోలను ఎవరు ఎలాంటి ప్రశ్న వేసినా రాజమౌళికి ఏదో ఒక సంబంధం ఉంటుంది. కాబట్టి, అదే తరహాలో ప్రశ్నలు, సమాధానాలు వస్తున్నాయి. ఇంటర్వ్యూల్లో రాజమౌళిని హీరోలు ఎక్కువగా పొగిడేస్తున్నారు. ఇంటర్వ్యూలలో ఒక దశలో, స్టార్ల నుండి అదే పాత ప్రశంసలను విని రాజమౌళి కూడా విసుగు చెంది ఉంటాడు కానీ ఎక్కడా బయట పాడడం లేదు. నిజానికి ప్రభాస్ లేదా రానా బాహుబలి ప్రమోషన్స్ సమయంలో ఈ రకమైన నాన్-స్టాప్ ప్రశంసలు కనిపించలేదు. కానీ ఈ హడావుడి మాత్రం తప్పడం లేదు.

ఇంకేమీ మాట్లాడకుండా

ఇంకేమీ మాట్లాడకుండా


దానికి తోడు సినిమా గురించి తప్ప ఇంకా దేని గురించీ మాట్లాడేందుకు ముగ్గురిలో ఎవరూ ఆసక్తి చూపడం లేదు. RRR టీమ్ బెంగళూరులో మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటరాక్షన్‌లో, ఒక కన్నడ జర్నలిస్ట్ దేశంలో ముస్లిం మహిళలపై ప్రభావం చూపుతున్న కర్ణాటకలోని హిజాబ్ అంశం గురించి పరోక్షంగా తారక్‌ను అడిగాడు. తారక్, ఎప్పటిలాగానే చాలా కామ్ గా "నేను ఈ వేదికపై రాజకీయాల గురించి మాట్లాడను, ఎందుకంటే నేను ఏది మాట్లాడినా RRR నుండి దృష్టిని దూరం చేస్తుంది." అని చెప్పుకొచ్చారు. ఇలా వేరే అంశాల జోలికి వెళ్లకుండా కేవలం RRR మీదనే ఫోకస్ పెట్టి అవే పాత చింతకాయ పచ్చడి ప్రశ్నలు సమాధానాలతో బోర్ కొట్టిస్తున్నారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X