twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    thalapathy 65: పాన్ ఇండియా సినిమాలను భయపెడుతున్న బీస్ట్.. RRR, పుష్ప ఎవరో ఒకరు తగ్గాల్సిందే!

    |

    మెల్లగా అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్స్ ఎత్తివేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక భవిష్యత్తుపై నమ్మకంతో పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని తేడా లేకుండా నిర్మాతలు రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్స్ ఇప్పుడు అందరికి అవసరమే. అందులో విజయ్ నటిస్తున్న బీస్ట్ పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పాన్ ఇండియా సినిమాలు కాస్త తగాల్సిందే అనే టాక్ వస్తోంది.

    సెకండ్ లుక్ కూడా అదిరింది

    సెకండ్ లుక్ కూడా అదిరింది

    కోలీవుడ్ హీరో తలపతి విజయ్ 65వ సినిమా బీస్ట్ ఫస్ట్ లుక్ ను బర్త్ డే సందర్భంగా ఒకరోజు ముందే విడుదల చేశారు. ఇక అర్ధరాత్రి విజయ్ నుంచి కూడా సెకండ్ లుక్ విడుదలయ్యింది. పోస్టర్ తోనే సినిమాపై ఒక్కసారిగా అంచనాల డోస్ పెంచేశారు. దర్శకుడు నెల్సన్ పెద్ద ప్రయోగమేదో చేయబోతున్నట్లు తెలుస్తోంది.

    బీస్ట్ రిలీజ్ టెన్షన్

    బీస్ట్ రిలీజ్ టెన్షన్

    ఇక బీస్ట్ సినిమా రిలీజ్ పై ప్రస్తుతం అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అనేక రకాల గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. దీంతో ఆ డేట్ కు రావాలని అనుకుంటున్న సినిమాల నిర్మాతలు కాస్త సందిగ్ధంలో ఒడ్డారు.

     విజయ్ ను ఢీ కొట్టడం కష్టమే

    విజయ్ ను ఢీ కొట్టడం కష్టమే

    నిజానికి పాన్ ఇండియా మార్కెట్ అంతగా లేకపోయినప్పటికీ విజయ్ ను సౌత్ లో అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. తమిళనాడు మార్కెట్ పాన్ ఇండియా సినిమాలకు చాలా అవసరం. కానీ విజయ్ సినిమా వస్తే అక్కడ 80% థియేటర్స్ ను అక్రమించడం కాయం. ఓపెనింగ్స్ లో కూడా అతన్ని ఎవరు ఢీ కొట్టలేరు.

    పుష్ప , RRR..

    పుష్ప , RRR..

    ఇక సంక్రాంతిపై ప్రస్తుతం కొన్ని పాన్ ఇండియా సినిమాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. అసలైతే హరహర వీరమల్లు, సర్కారు వారి పాట సంక్రాంతికి రావాల్సింది. కానీ షూటింగ్స్ వాయిదా పడడంతో అప్పుడు రాకపోవచ్చు. దీంతో అల్లు అర్జున్ పుష్పతో పాటు బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR సంక్రాంతిని ఫోకస్ చేశాయి. ఒకవేళ సెట్టవ్వకుంటే RRR వచ్చే సమ్మర్ కు షిఫ్ట్ కావచ్చు.

    Recommended Video

    Actor Altaf Hassan About His Struggles | Battala Ramaswami Biopikku
    పోటీకి దిగితే..

    పోటీకి దిగితే..

    ఇక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్న సమయంలో విజయ్ మరో సంక్రాంతిని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. హీరోల మార్కెట్ ఎంత ఉన్నప్పటికీ ఒకేసారి పోటీకి దిగితే మాత్రం నష్టాల ప్రభావం గట్టిగానే ఉంటుంది. ఇక సంక్రాంతి అనుకుంటే తప్పకుండా ఒక వారమైనా గ్యాప్ ఉండి తీరాలి మరి నిర్మాతలు ఏ విదంగా ఆలోచిస్తారో చూడాలి.

    English summary
    Slowly all states are preparing to lift lockdowns. Producers are preparing to announce release dates regardless of whether big movies are small movies with confidence in the future. Festival seasons in particular are what everyone needs now. It seems that the Beast starring Vijay is ready for the competition. There is talk that Pan India movies will be hit a bit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X