టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!

మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు చాలా తక్కువగా వస్తుంటాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రేక్షకలు ఆలోచనా ధోరణిలో మార్పులు రావడంతో పాటు హీరోలు కూడా తమ ఇగోలను పక్కన పెట్టేస్తున్నారు. దీంతో వేరే వాళ్లతో కలిసి నటించేందుకు ముందుకొస్తున్నారు. ఈ కారణంగానే ఇటీవలి కాలంలో ఎన్నో మల్టీస్టారర్ మూవీలు వచ్చాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ కలయికలో ఓ సినిమా రాబోతుందని తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం!

పూనమ్ భజ్వా కొత్త లుక్ మాములుగా లేదు (ఫొటోలు)

తెలుగులో మల్టీస్టారర్స్.. అన్నీ సూపర్ హిట్లే

తెలుగులో మల్టీస్టారర్స్.. అన్నీ సూపర్ హిట్లే

కొన్నేళ్లుగా తెలుగులో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. దీనికి కారణం అటువంటి సినిమాలకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనే. మహేశ్ బాబు, వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', వెంకటేష్.. పవన్ కల్యాణ్ కలిసి చేసిన 'గోపాల.. గోపాల', 'మనం', 'F2', 'వెంకీ మామ' సహా మరికొన్ని చిత్రాలు సూపర్ హిట్ అవడంతో హీరోలు రెడీ అంటున్నారు.

టాలీవుడ్ చరిత్రలోనే భారీ మల్టీస్టారర్ మూవీ

టాలీవుడ్ చరిత్రలోనే భారీ మల్టీస్టారర్ మూవీ

'బాహుబలి' లాంటి భారీ విజయం తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం RRR. స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. వాస్తవానికి ఇది 2020లోనే విడుదల కావాల్సింది. కానీ, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

ఈ ఏడాది రాబోతున్న మల్టీస్టారర్ మూవీలు

ఈ ఏడాది రాబోతున్న మల్టీస్టారర్ మూవీలు

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఈ మల్టీ స్టారర్ మూవీ 'F2'. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'F3'ని చేస్తున్నారు. ఇక, పవన్ కల్యాణ్ - రానా కాంబినేషన్‌లో కూడా ఓ మూవీ రాబోతుంది. 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు.

టీవీ యాంకర్ అర్చన విజయ: బికినిలో అందాలు ఆరబోత (ఫొటోలు)

తెలుగులో మరో భారీ మల్టీస్టారర్ రాబోతుంది

తెలుగులో మరో భారీ మల్టీస్టారర్ రాబోతుంది

ఇటీవలి కాలంలో స్టార్ హీరోలంతా మల్టీస్టారర్ చిత్రాల్లో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో దర్శక నిర్మాతలు కూడా అదే తరహా చిత్రాలను రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే టాలీవుడ్‌లోని ఇద్దరు స్టైలిష్ హీరోలు అల్లు అర్జున్.. విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుందని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

ఇద్దరు హీరోలు.. చిన్న డైరెక్టర్.. బడా నిర్మాత

ఇద్దరు హీరోలు.. చిన్న డైరెక్టర్.. బడా నిర్మాత

భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాను 'ఆనందో బ్రహ్మ', 'యాత్ర' వంటి చిత్రాలను తీసిన దర్శకుడు మహేశ్ వీ రాఘవ్ రూపొందించబోతున్నాడని తెలుస్తోంది. దీన్ని గీతా ఆర్ట్స్, GA2 పిక్చర్స్ బ్యానర్లపై బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మించనున్నారని తెలిసింది. 2021 చివర్లో ఈ మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Recommended Video

Master Movie : Lokesh Kanagaraj లాంటి దర్శకుడికి అందరూ సపోర్ట్ చేయాలి.. | Thalapathy Vijay
ఇధ్దరూ పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీ

ఇధ్దరూ పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీ

ప్రస్తుతం అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీలో అతడు గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటిస్తున్నాడు. మరోవైపు.. విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌తో 'లైగర్' అనే మూవీ చేస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. ఇందులో అతడు బాక్సర్‌గా చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X