మహేశ్ బాబు - విజయ్ దేవరకొండ మల్టీస్టారర్.. రాజమౌళి సలహా వల్లే ఈ నిర్ణయం.!

By Manoj

తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలు చాలా తక్కువగా వస్తుంటాయి అన్న టాక్ ఉంది. అయితే, కొన్నేళ్లుగా ఆ పరిస్థితి మారిపోయింది. ప్రేక్షకుల అభిరుచి, ఆలోచనా ధోరణిలో మార్పులు రావడానికితోడు హీరోలు కూడా ఇగోలను పక్కన పెట్టేసి సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. దీంతో మల్టీస్టారర్ మూవీలు చేయడానికి దర్శక నిర్మాతలు కూడా సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్ మూవీ రాబోతుందని ఓ న్యూస్ లీకైంది. అందులో మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ కలిసి నటించబోతున్నారట. ఆ వివరాలు మీకోసం.!

సర్కారి వారి పాట పాడుతున్న మహేశ్ బాబు

సర్కారి వారి పాట పాడుతున్న మహేశ్ బాబు

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే పరశురాం దర్శకత్వంలో ‘సర్కారి వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థతో పాటు మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. దానికి భారీ రెస్పాన్స్ వస్తోంది.

కొట్లాటకు సిద్ధమవుతోన్న విజయ్ దేవరకొండ

కొట్లాటకు సిద్ధమవుతోన్న విజయ్ దేవరకొండ

కొంత కాలంగా పరాజయాలు పలుకరిస్తుండడంతో నిరాశగా ఉన్నాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం అతడు డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఫైటింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ మూవీకి ‘లైగర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

 విజయ్ దేవరకొండతో మహేశ్ బాబు సినిమా

విజయ్ దేవరకొండతో మహేశ్ బాబు సినిమా

సినీ హీరోగా కొనసాగుతున్నప్పటికీ పలు వ్యాపారాలు చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే ‘జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్' అనే నిర్మాణ సంస్థనూ స్థాపించాడు. ఈ బ్యానర్ ద్వారా ప్రస్తుతం అడవి శేష్ హీరోగా ‘మేజర్' అనే సినిమా తెరకెక్కుతోంది. దీని తర్వాత విజయ్ దేవరకొండతో కూడా అతడు సినిమా చేయబోతున్నట్లు గతంలో ప్రచారం జరిగింది.

రాజమౌళితో మహేశ్.. విజయ్‌ది క్లారిటీ లేదు

రాజమౌళితో మహేశ్.. విజయ్‌ది క్లారిటీ లేదు

ప్రస్తుతం చెరో సినిమాతో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ, మహేశ్ బాబు. ఈ చిత్రాల తర్వాత ఈ ఇద్దరు హీరోలు చేసే ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అందులో మహేశ్ బాబు.. రాజమౌళి మూవీ చేస్తాడనే వార్త కన్ఫార్మ్ అవగా... విజయ్ సినిమాకు సంబంధించిన వార్తల్లో మాత్రం ఎటువంటి క్లారిటీ రావడం లేదు.

మహేశ్ బాబు - విజయ్ దేవరకొండ మల్టీస్టారర్

మహేశ్ బాబు - విజయ్ దేవరకొండ మల్టీస్టారర్

తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో మల్టీస్టారర్ మూవీ రాబోతుందని తాజాగా ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం... మహేశ్ బాబు.. విజయ్ దేవరకొండతో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాడట. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించబోతున్నాడని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని ప్రచారం జరుగుతోంది.

Recommended Video

Mega Star Chiranjeevi About Talasani Seva Trust
 రాజమౌళి సలహా వల్లే మహేశ్ ఈ నిర్ణయం.!

రాజమౌళి సలహా వల్లే మహేశ్ ఈ నిర్ణయం.!

పరశురాంతో సినిమా తర్వాత మహేశ్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో నటించాల్సి ఉంది. అయితే, దానికి చాలా సమయం పడుతుందని, ఈలోపు మరో సినిమా చేసుకోమని జక్కన్న.. సూపర్ స్టార్‌కు సలహా ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇందుకోసమే శేఖర్ కమ్ముల చెప్పిన లైన్ విన్న మహేశ్.. పూర్తి కథతో రమ్మని చెప్పాడని వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X