ఫ్యామిలీ స్టార్‌కు జగపతి బాబు మూవీకి లింక్.. ఊహించని విధంగా విజయ్, మృణాల్ రొమాన్స్
చిన్న చిన్న పాత్రలతో సినిమా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత సోలో హీరోగా మారి సక్సెస్ అయ్యాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. దీనికితోడు ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. స్టార్‌డమ్‌ను సైతం అందుకున్నాడు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఇలా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే వెళ్తున్నాడు.
కొత్తలో ఎన్నో హిట్లను అందుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు మాత్రం వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. దీంతో ఈ సారి బిగ్ సక్సెస్‌ను కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఇందుకోసం తన 13వ చిత్రంగా 'ఫ్యామిలీ స్టార్'ను చేస్తున్నాడు. 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురాం దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయని చెప్పొచ్చు.

హిట్ కాంబినేషన్‌లో రాబోతున్న 'ఫ్యామిలీ స్టార్' మూవీని అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా రూపొందిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను జరుపుతున్నారు. ఇలా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న 'ఫ్యామిలీ స్టార్' మూవీకి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం గురించి క్రేజీ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ మూవీకి, జగపతి బాబు 'పెళ్లైన కొత్తలో' మూవీకి లింక్ ఉంటుందట. అందులో హీరో, హీరోయిన్ల మాదిరిగానే 'ఫ్యామిలీ స్టార్'లో చాలా సన్నివేశాలను పెట్టారని తెలిసింది.

ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'ఫ్యామిలీ స్టార్' మూవీలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ మధ్య వచ్చే సన్నివేశాలు క్రేజీగా ఉంటాయట. ముఖ్యంగా వీళ్లిద్దరూ మొదట ఇష్టం లేకుండానే కాపురం చేయడం.. తర్వాత రొమాంటిక్‌గా కనిపించడం వంటివి ఇందులో హైలైట్‌గా ఉంటాయని సమాచారం. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ - పరశురాం కలయికలో తెరకెక్కుతోన్న 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











