విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి డేట్ ఫిక్స్..? ఫిబ్రవరి లో నిశ్చితార్థం.?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు సహజం. హీరో హీరోయిన్లు, హీరోయిన్ దర్శకులు ప్రేమలో పడటం కామన్. అయితే ఎప్పటినుంచో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా వీరి పెళ్లి వార్తలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరు త్వరలోనే పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారట. అంతే కాదు.. నిశ్చితార్థం డేట్ కూడా వచ్చేసింది. అందరూ అనుకున్నట్లే వీరు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారని తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పెళ్లి వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై వీరు ఎప్పుడు స్పందించలేదు. ఇక ఈ జంట గీతా గోవిందం సినిమాతో స్క్రీన్ మీద కనిపించారు. ఆ సినిమాతోనే వీరి జంటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు. ఇక ఈ సినిమాలో నిజంగా లవ్ లో పడ్డారా అన్నట్లుగా కిస్సులు, హగ్గులతో రొమాన్స్ చేశారు.

Vijay Devarakonda And Rashmika Mandanna Marriage Date Fix News Goes Viral

ఇక ఈ జంట ప్రేమలో ఉన్నట్లు, డేటింగ్ కూడా చేస్తున్నట్లు ఎన్నో సార్లు వార్తలు బయటకు వచ్చాయి. అంతే కాదు... లాజిక్స్ వెతినే నెటిజన్లకు ఎప్పటికప్పుడు విజయ్-రష్మికలు దొరుకుతూనే ఉన్నారు. మల్దీవ్స్ కు వెకేషన్ కు వెళ్లి.. విడివిడిగా ఫోటోలు పెట్టి.. ఆ ఫోటోల్లో లొకేషన్ ప్లేస్ ఒకే దగ్గర ఉండటంతో దొరికిపోయారు. ముంబయ్ లో రెస్టారెంట్లకు డిన్నర్ డేట్లకు వెళ్లి కెమెరాల కంట్లో పడి వార్తల్లో నిలిచారు. ఒకే కలర్, బ్రాండ్, మోడల్ డ్రస్ ను వేసుకుని మరోసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.

ఇలా వీరు ప్రేమలో ఉన్నట్లు పలు సార్లు నెటిజన్స్ బట్టబయలు చేసిందే. అయితే ఇదే క్రమంలో విజయ్ రష్మికతో త్వరలో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్లు వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక దాదాపుగా ప్రతి పండుగకు విజయ్ ఇంటికి వెళ్తుంది. మొన్నటి దీపావళికి కూడా వెళ్లి దొరికిపోయిందనుకోండి. ఇక లేటెస్ట్‌గా ఈ జంట వివాహా బంధంతో ఒకటి కాబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో ఇన్ సైడ్ టాక్.

Vijay Devarakonda And Rashmika Mandanna Marriage Date Fix News Goes Viral

ఈ దాగుడు మూతలు ఆడుతున్న లవ్ బర్డ్స్... అతి త్వరలో ఈజంట ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నారట. దీనికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఓ మంచి రోజు చూసుకుని ఈ కార్యక్రమాన్ని చేసుకోనున్నారని టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ఈ ఈవెంట్ ఫిబ్రవరిలో సెకండ్ వీక్‌ లో ఉంటుందని అంటున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నెట్టింట్లో వైరల్ గా మారింది.

ప్రస్తుతం రష్మిక, విజయ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్ బిజీలో ఉండగా.. రష్మిక ది గర్లఫ్రెండ్ సినిమాతో బిజీగా ఉంది. ఇక ఫ్యామిలీ స్టార్ లో మృణాల్ ఠాకూర్ తో పాటు.. రష్మిక మందన్నా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా కూడా ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X