Vijay Devarakonda: ఆ అగ్ర హీరోతో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాలో రౌడి స్టార్.. నెవ్వర్ బిఫోర్ రోల్!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ అనే పాన్ ఇండియా సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని అనుకున్నాడు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ కూడా విజయ్ దేవరకొండ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పవచ్చు. అతనికి వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఖుషి సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే ఈ తరుణంలో విజయ్ కు మరొక అగ్ర హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ ప్రభావం పడలేదు
విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన లైగర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో విజయ్ తదుపరి సినిమాలపై కూడా ప్రభావం పడుతుందని అనుకున్నారు. కానీ ఖుషి సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను చూస్తే ఆ ప్రభావం ఏమి పెద్దగా పడలేదు అని అనిపిస్తుంది. సమంత కథానాయకగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఆసక్తికరమైన లైనప్
తెలుగు చిత్ర పరిశ్రమలో రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న విజయ్ ఇప్పుడు మిగతా ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ అయితే అందుకున్నాడు. ప్రస్తుతం లైనప్ లో ఆసక్తికరమైన కాంబినేషన్స్ ఉన్నాయని చెప్పవచ్చు. ముందుగా అయితే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఆ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నాడు.

సుకుమార్ తో కూడా..
అలాగే విజయ్ దేవరకొండ లైనప్ లో మరో అగ్ర దర్శకుడు కూడా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు గత ఏడాది క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. పుష్ప సెకండ్ పార్ట్ తో బిజీగా ఉన్నా సుకుమార్ ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో చేసే ఛాన్స్ ఉంది. అయితే ఆ దర్శకుడు రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా చేయనున్నాడు. ముందుగా ఏ హీరో దొరికితే ఆ హీరో తోనే సినిమా చేసే ఛాన్స్ ఉంది.

బిగ్గెస్ట్ మల్టీస్టారర్
ఇక విజయ్ దేవరకొండ ఇటీవల మరొక బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో అవకాశం అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ మలయాళం హీరో మోహన్ లాల్ నటించబోతున్న ఒక భారీ పాన్ ఇండియా సినిమాలో విజయ్ దేవరకొండ ఆయన కొడుకుగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కథపై కూడా కొన్ని చర్చలు జరిపినట్లు సమాచారం.

నెవ్వర్ బిఫోర్ రోల్
మోహన్ లాల్ వృషభ అనే ఒక మలయాళం పిరియాడికల్ సినిమాలో నటించబోతున్నాడు. ప్రముఖ మలయాళ దర్శకుడు నందకిషోర్ ఆ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఇక అందులో విజయ్ నెవ్వర్ బిఫోర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అతని పాత్రకు సంబంధించిన చర్చలు కూడా కొనసాగినట్లు తెలుస్తోంది. ఇంకా విజయ్ అయితే అఫీషియల్ గా ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











