మళ్ళీ మొదటికొచ్చిన విజయ్ దేవరకొండ.. హిట్టిచ్చిన దర్శకుడితో మరో ప్రయోగం

టాలీవుడ్ లో రౌడి స్టార్ గా తనకంటూ ఒక స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక కొత్తదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. కామెడీ సినిమా అయినా లవ్ స్టొరీ అయినా రెగ్యులర్ గా ఉండకూడదని అనుకుంటాడు. అందుకే క్యారెక్టర్స్ కూడా చాలా కొత్తగా కనిపిస్తాయి. ఇక త్వరలో ఈ స్టార్ హీరో మళ్ళీ మొదట ఎలాంటి సినిమాలు చేశాడో అలానే మరో ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

 త్వరలో ఫైటర్ ఫస్ట్ లుక్..

త్వరలో ఫైటర్ ఫస్ట్ లుక్..

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఫైటర్ అనే ఆ సినిమాలో ఈ రౌడి స్టార్ ఒక బాక్సర్ గా దర్శనమివ్వబోతున్నాడు. ఆ సినిమా ఈపాటికే పూర్తవ్వాల్సింది. కానీ కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా వేయక తప్పలేదు. ఇక ఫైనల్ గా సినిమాకు సంబంధించిన షూటింగ్ ని వీలైనంత త్వరగా ఫినిష్ చేసి టైటిల్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

 మరోసారి పెళ్లి చూపులు దర్శకుడితో

మరోసారి పెళ్లి చూపులు దర్శకుడితో

ఇక విజయ్ దేవరకొండ మొదటి సక్సెస్ పెళ్లి చూపులు తరహాలో సినిమా చేసి చాలా కాలమయ్యింది. కామెడీ ఎంటర్టైనర్ తరహాలో ఒక ఫుల్ మూవీ చేయాలని అనుకుంటున్నాడు. అందుకోసం తరుణ్ భాస్కర్ ని కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా ఈ కాంబినేషన్ పై అనేక రకాలుగా రూమర్స్ అయితే వస్తున్నాయి.

ఒక రొమాంటిక్ కామెడీ కథ..

ఒక రొమాంటిక్ కామెడీ కథ..

అయితే లాక్ డౌన్ లో తరుణ్ భాస్కర్ విజయ్ కోసం రెండు విభిన్నమైన కథలను రెడీ చేయగా అందులో ఒక రొమాంటిక్ కామెడీ కథ విజయ్ కి చాలా బాగా నచ్చిందట. గీత గోవిందం తరువాత అభిమానులు ఎక్కువగా విజయ్ నుంచి అలాంటి సినిమాల్లో చూడాలని కూడా కోరుకుంటున్నారు. గత సినిమాల ప్రభావం ఎలా ఉన్నా కూడా విజయ్ క్రేజ్ లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు

Recommended Video

Meeku Matrame Chepta Title Announcement | Vijay Devarakonda | Tharun Bhascker || Filmibeat Telugu
టార్గెట్ సెట్ చేసుకున్న విజయ్ దేవరకొండ

టార్గెట్ సెట్ చేసుకున్న విజయ్ దేవరకొండ

ఎలాగైనా తరుణ్ భాస్కర్ తో వచ్చే ఏడాది ఒక మంచి పెళ్లి చూపులు లాంటి సినిమాను రిలీజ్ చేయాలని విజయ్ టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫైటర్ సినిమా తరువాత విజయ్ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. కుదిరితే ఆ సినిమా కంటే ముందే ఒక రొమాంటిక్ కామెడీ కథతో వచ్చే అవకాశం ఉందట. అలాగే విజయ్ మరో ఇద్దరి దర్శకులను కూడా వెయిటింగ్ లిస్ట్లో పెట్టినట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X