Vijay Devarakonda: రామ్ చరణ్ తరువాత విజయ్ తో ఆ దర్శకుడు.. లైనప్ లో మొత్తం ఎన్ని సినిమాలంటే..

టాలీవుడ్ రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విజయ్ దేవరకొండ తదుపరి సినిమాలతో మిగతా ఇండస్ట్రీలలో కూడా మంచి క్రేజ్ అందుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కూడా విజయ్ తన ప్రయత్నాలు ఏ మాత్రం తగ్గించకుండా తదుపరి సినిమాలతో మరింత బలంగా సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు.

ప్రస్తుతం అయితే శివ నిర్మాణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఖుషి అనే టైటిల్ తో రాబోతున్న ఆ సినిమా సౌత్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. అలాగే ఇదివరకే సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు విజయ్ క్లారిటీ ఇచ్చేశారు. ఆ ప్రాజెక్టులో సుకుమార్ పుష్ప సినిమా తర్వాత మొదలు పెట్టబోతున్నాడు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ మరో దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Vijay devarakonda another project almost finalized with jersey director

ఆ దర్శకుడు మరెవరో కాదు గౌతమ్ తిన్ననూరి అని టాక్ అయితే వినిపిస్తోంది. జెర్సీ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న ఈ దర్శకుడు హిందీలో అదే సినిమాను రీమేక్ చేశాడు. అయితే అక్కడ మాత్రం ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం అయితే రామ్ చరణ్ తో ఈదర్శకులో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

Vijay devarakonda another project almost finalized with jersey director

ఇక విజయ్ దేవరకొండ తో కూడా ఇదివరకే ఒక కథను వినిపించిన గౌతమ్ రీసెంట్ గా గ్రీన్ సిగ్నల్ తీసుకున్నట్లు సమాచారం. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ వీరి ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే విజయ్ వరుసగా మూడు కాంబినేషన్స్ ను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. వీరి మధ్యలో కొన్ని కథల గురించి కూడా చర్చలు జరిగాయి కానీ ఇప్పటివరకు ఏదీ ఫైనల్ కాలేదు. కానీ తప్పకుండా మాత్రం వీరు సినిమా చేయాలని ఆలోచనతోనే ఉన్నారు. అలాగే విజయ్ మరో ఇద్దరి దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X