Kalki 2898 AD: ప్రభాస్ కల్కి సినిమాలో మరో పాన్ ఇండియా హీరో... ఇది కదా కిక్కిచ్చే న్యూస్!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా గత ఏడాది సలార్ వచ్చి సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఆయన నటిస్తున్న చిత్రాల్లో కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో ఇప్పటికే స్టార్ హీరోలు నటిస్తున్నారు. అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరో పాన్ ఇండియా హీరో కూడా భాగం కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...
గత ఏడాది ప్రభాస్ ఆదిపురుష్, సలార్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ రెండు చిత్రాల్లో సలార్ సూపర్ హిట్టుగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. అయితే ఇదిలా ఉంటే.. ప్రభాస్ నటిస్తున్న చిత్రాలు కల్కి ఒకటి కాగా.. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ మరొకటి. ఈ రెండు చిత్రాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రాజా సాబ్ నుంచి విడుదల అయిన పోస్టర్ ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898 ఏడి చిత్రం ఈ ఏడాది మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది భారీ బడ్జెట్ తో యాక్షన్ ఫాంటసీ చిత్రంగా రూపొందుతుంది. ఈ సినిమాని సైన్స్ ఫిక్షన్ కథ అంశంతో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో హీరోయిన్స్ గా దిశాపటాని ,దీపికా పదుకొనే నటిస్తున్నారు.
ఇక ప్రభాస్ కు ధీటుగా లోకనాయకుడు కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ తార గానంతో నాగ్ అశ్విన్ చేస్తున్న ఈ ప్రయోగాత్మకంగా చిత్రం... సినీ చరిత్రలోనే ఒక అద్భుతంగా మారుతుందని ఫ్యాన్స్, సినీ ప్రముఖులు అంటున్నారు. ఇలాంటి సమయంలోనే ఈ సినిమాలో మరో ఇద్దరు స్టార్ హీరోలు సైతం గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఇది అధికారికంగా కన్ఫార్మ్ కాకపోయినా... ఇప్పుడు మరొక స్టార్ హీరో పేరు వినిపిస్తుంది. పాన్ ఇండియా స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా గెస్ట్ రోల్ లో కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దుల్కర్ పాత్ర కన్ఫార్మ్ కాకముందే మరో హీరో దేవరకొండ ఈ ప్రాజెక్టులో భాగం అయినట్లు సమాచారం.

ఇక నాగ్ అశ్విన్ విజయ్ దేవర కొండ రిలేషన్ ఇప్పటిదీ కాదు.. ఎవడే సుబ్రమణ్యం టైమ్ నుంచి వీరికి మంచి బాండింగ్ ఉంది. ఆ తర్వాత మహా నటి చిత్రంలోనూ విజయ్ దేవరకొండ కీలక పాత్రలో నటించారు. మరి ఈ పాన్ వరల్డ్ చిత్రంలో దేవరకొండ కూడా భాగం అయితే సూపర్ గా ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. న్యూస్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











