Don't Miss!
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
విజయ్ దేవరకొండ సక్సెస్ ఫార్మూలా.. కెరీర్ కోసం అలా చేయకతప్పడం లేదట!
టాలీవుడ్ రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు విజయ్ దేవరకొండ. అవకాశం వచ్చిన ప్రతిసారి బాక్స్ ఆఫీస్ వద్ద మినిమామ్ వసూళ్లను అందుకునే ఈ యంగ్ హీరో ఈ మధ్య ఎందుకో ఎలాంటి ప్రయోగాలు చేసినా వర్కౌట్ కావడం లేదు. డియర్ కామ్రేడ్ సౌత్ లో భారీగా రిలీజ్ చేసి దెబ్బతిన్న విజయ్ ఆ తరువాత చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా స్ట్రాంగ్ గా దెబ్బకొట్టడం భయాన్ని కలిగిస్తోందట.
ఊహించని దెబ్బ..
గీతగోవిందం వరకు రౌడీ స్టార్ ఇమేజ్ ఒక రేంజ్ లో ఉండేది. ఆ సినిమా తరువాత విజయ్ ఎలాంటి సినిమలైనా చేయగలాడేమో అన్నట్లు ఒక టాక్ వచ్చింది. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో విజయ్ తీసుకున్న నిర్ణయాలపై కూడా అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. మధ్యలో టాక్సీ వాలా సినిమా తరువాత విజయ్ చేస్తున్న ప్రయోగాలు ఊహించని దెబ్బకొడుతున్నాయి.
డిజాస్టర్స్ కోసం కొన్నాళ్ళు రిస్క్ లేకుండా..
సాధారణంగా అపజయాలు ఎదురైనప్పుడు స్టార్స్ రిస్క్ లేకుండా సినిమాలు చేయాలని అనుకుంటారు. కానీ ఆడియెన్స్ మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అందుకే విజయ్ సక్సెస్ ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. కొన్నాళ్ళు కొత్త దర్శకులను అలాగే ప్రయోగాత్మక కాన్సెప్ట్ లకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఫామ్ లో ఉన్న దర్శకులు చెప్పే కొత్త తరహా కథలకు మాత్రమే ఓకే చేయాలని ఫిక్స్ అయ్యాడట.
Recommended Video
అందుకే పూరి, శివ.. ప్రాజెక్ట్స్
పూరి జగన్నాథ్ తో ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'ఫైటర్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అసలైతే పూరితో విజయ్ గత ఏడాదే సినిమా చేయాల్సింది. కానీ కథలో మార్పులు చేయాలని సినిమా ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయ్యేవరకు ఫైటర్ ని స్టార్ట్ చేయలేదు. ఇక శివ నిర్వాణతో కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్న విజయ్ కథలో గట్టిగా సక్సెస్ ఎలిమెంట్స్ ఉన్నాయని ఒప్పుకున్నారట. ఆ దర్శకుడు మజిలీతో సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. మరి విజయ్ కెరీర్ కోసం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.