Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
అనుష్క శెట్టి సినిమాలో టాలెంటెడ్ హీరోస్.. విజయ్ దేవరకొండ కూడా..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నెవర్ బిఫోర్ అనేలా కాంబినేషన్స్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్శకులు హీరోలు వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇక అనుష్క శెట్టి చేయబోయే ఒక సినిమాలో ఇద్దరు టాలెంటెడ్ హీరోలు నటించబోతున్నట్లు సమాచారం. అందులో విజయ్ దేవరకొండ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
డిజాస్టర్ టాక్..
బాహుబలి అనంతరం పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ అందుకున్నప్పటికి అనుష్క చాలా నెమ్మదిగానే వెళుతోంది. మధ్యలో బాగమతితో బాక్సాఫీసు హిట్ అందుకున్న స్వీటీ ఆ తరువాత పెద్దగా హిట్స్ అందుకోలేదు. నిశ్శబ్దం డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయగా ఆ సినిమా డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.
అవకాశాలు చాలానే వస్తున్నాయి
అనుష్కకు అవకాశాలు చాలానే వస్తున్నాయి గాని ఎందుకో గతంలో మాదిరిగా అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. చాలా సెలెక్టివ్ గా తనకు సెట్టయ్యే సినిమాలను మాత్రమే చేయాలని ఫిక్స్ అయ్యింది. కథలు నచ్చకపోతే రెమ్యునరేషన్ ఎంత ఆఫర్ చేసినా కూడా అనుష్క పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదట.
నవీన్ పొలిశెట్టితో రొమాన్స్
ఇక ప్రస్తుతం ఆమె యూవీ క్రియేషన్స్ లో ఒక సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతోంది. రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ చెప్పిన ఒక డిఫరెంట్ లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన స్వీటీ 35+ వయసున్న పెళ్లికాని మహిళ పాత్రలో నటించనుందట. ఇక ఆ సినిమాలో నవీన్ పొలిశెట్టి పాతికేళ్ల కుర్రాడిగా కనిపించనున్నాడు.
నవీన్ పొలిశెట్టి - విజయ్ దేవరకొండ
దాదాపు పడేళ్లకు పైగా వ్యత్యాసం ఉన్న జంట మధ్య ప్రేమ కొనసాగితే ఎలా ఉంటుందనే పాయింట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టితో పాటు విజయ్ దేవరకొండ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. గెస్ట్ రోల్ అని కూడా టాక్ వస్తోంది గాని ఇంకా ఫైనల్ క్లారిటీ అయితే రాలేదు. మరి ఈ డిఫరెంట్ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.