For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vijay Devarakonda: లైగర్ మొదటి ప్రీమియర్ షోకు కరణ్ జోహార్ బిగ్ ప్లాన్.. ఎప్పుడంటే?

    |

    రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనే అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు చిత్ర యూనిట్ ఎక్కడ ప్రమోషన్స్ చేయడానికి వెళ్ళినా కూడా జనాల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ అయితే వచ్చింది.

    ముఖ్యంగా నార్త్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే తో కలిసి చేస్తున్న ప్రమోషన్స్ కు కూడా మంచి స్పందన లభిస్తుంది. ముఖ్యంగా ఫ్యాన్ ఇండియా రేంజ్ లోనే ఈవెంట్స్ చేయాలి అని విజయ్ ఆలోచించగా జనాలు ఊహించిన దాని కంటే ఎక్కువ స్థాయిలో రావడంతో సరైన బందోబస్తు నిర్వహించే పరిస్థితి కూడా ఏర్పడడం లేదు. జనాలు అధిక సంఖ్యలో రావడం వలన కొన్ని ఈవెంట్స్ క్యాన్సిల్ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

    Vijay devarakonda liger movie first premiere show plan in mumbai

    ఏదేమైనా కూడా విజయ్ దేవరకొండ సినిమాకు భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. తప్పకుండా సినిమా అయితే ఫ్యాన్ ఇండియా మార్కెట్ కు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం కాయమని కూడా అర్థమవుతుంది. ఇక ఈ సినిమాను పూరి జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ కూడా సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే.

    అయితే లైగర్ సినిమా మొదటి ప్రీమియర్ షోను ప్రదర్శించడానికి ఇటీవల చర్చలు జరిపినట్లు సమాచారం. సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. అయితే ఒకరోజు ముందుగానే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సినీ ప్రముఖులందరికీ కూడా లైగర్ సినిమా స్పెషల్ షోను చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్ర హీరోలతో పాటు ప్రముఖ దర్శకులు అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్స్ కూడా ముంబైలో ప్రదర్సించే ఆ స్పెషల్ ప్రీమియర్ షోలో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి లైగర్ సినిమా వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

    English summary
    Vijay devarakonda liger movie first premiere show plan in mumbai
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X