Kushi: విజయ్ దేవరకొండ డైరెక్షన్‌లో ఆ హీరో సినిమా... ఎప్పుడు రానుందంటే?
విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ.. పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్నారు. గత ఏడాది లైగర్ లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత ఇప్పుడు ఖుషి సినిమాతో రాబోతున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే....
విజయ్ దేవరకొండ... ఈ హీరో నువ్విలా సినిమాలో చిన్న రోల్ తో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రమణ్యం సినిమాల్లో కనిపించాడు. ఇక పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ... అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సెషన్ స్టార్ అయిపోయాడు. ఇక వరుసగా సినిమాలు చేస్తూ.. స్టార్ హీరో అయిన విజయ్.. గత ఏడాది లైగర్ సినిమాతో భారీ దెబ్బను ఎదుర్కొన్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తే.. డిజాస్టర్ గా నిలిచింది.

ఇక లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్ వంటి చిత్రాలు తీసిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక ఈ మూవీకి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించారు. ఇక ఈ సినిమా రేపు సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ సహా హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
ఇక ఖుషి మూవీ ట్రైలర్స్, సాంగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా మ్యూజిక్ కాన్సర్ట్ లో సమంతతో కలిసి విజయ్ చేసిన డ్యాన్స్ వైరల్ గా మారింది. ఇక విజయ్, సామ్ కలిసి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఇక ముఖ్యంగా విజయ్ తన అభిమానులతో క్యూ అండ్ ఏ నిర్వహించారు. సోషల్ మీడియా ఖాతాలలో ఇది లైవ్ లో స్ట్రీమ్ కూడా అయ్యింది. ఈ క్రమంలోనే విజయ్ ఖుషి సినిమా హైలెట్స్ తో పాటు తన పర్సనల్ లైఫ్ అభిప్రాయాలను బయటపెట్టారు.

ఖుషి సినిమాలో ఎమోషన్, లవ్ రొమాన్స్, యాక్షన్ కంటే ఫన్ ఎక్కువగా ఉంటుదంని తెలిపారు. ఫస్ట్ ఆఫ్ లో వెన్నెల కిషోర్ తో మంచి కామెడీ వర్కౌట్ అయిందన్న విజయ్.... ఇక సెకండ్ హాఫ్ లో రాహుల్ రామకృష్ణతో కలిసి నవ్విస్తానని చెప్పుకొచ్చారు. ఇక ఖుషి టైటిల్ సాంగ్ కూడా వినగానే బాగా నచ్చింది అని విజయ్ చెప్పాడు. ఇక సమంత గురించి మాట్లాడుతూ ఈ సినిమా కోసం ఆమె ఆరోగ్యం బాగోలేకున్నా కూడా సహకరించిందని చెప్పుకొచ్చాడు

ఇక తనకు డైరెక్షన్ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన విజయ్.... డైరెక్షన్ చేయడం అనేది ఎగ్జైట్ చేస్తూ ఉంటుందన్నారు. ఇక లైఫ్ లో కొద్దికాలం తర్వాత యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకుని.. డైరెక్షన్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయి.. సినిమా తీస్తా అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు వయసు ఉంది.. చేసినన్ని సినిమాలు చేసి.. డైరెక్షన్ మీద ఫొకస్ పెడుతానని చెప్పుకొచ్చాడు. ఇక దీనికి ఆనంద్ దేవరకొండను హీరోగా పెట్టి తీస్తే బాగుంటుందని ఫన్నీగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











