ప్రభాస్ స్థానంలో విజయ్ దేవరకొండ... ఆమె ద్వారా సెట్ చేశారా?

'బాహుబలి' విడుదల తర్వాత ప్రభాస్ పేరు నేషనల్ వైడ్ మార్మోగి పోయింది. యంగ్ రెబల్ స్టార్ క్రేజ్ చూసి పలువురు బాలీవుడ్ నిర్మాతలు సైతం ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించారు. ముఖ్యంగా ఆ మధ్య కరణ్ జోహార్ పేరు బాగా వినిపించింది. అయితే సోహో షూటింగ్, మరికొన్ని కమిట్మెంట్స్ ఉండటంతో కరణ్ జోహార్ ప్రతిపాదను ప్రభాస్ స్వీకరించలేక పోయాడనే వార్తలు సైతం అప్పట్లో వినిపించాయి.

సౌత్‌లో సెన్సేషనల్ హీరోతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న కరణ్ జోహర్ దృష్టి ఇపుడు విజయ్ దేవరకొండ మీద పడిందంట. ఈ టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కూడా అతడితో చేయడానికి ఆసక్తి చూపుతున్నాడట.

 ప్రభాస్ స్థానాన్ని విజయ్ రీప్లేస్ చేస్తాడా?

ప్రభాస్ స్థానాన్ని విజయ్ రీప్లేస్ చేస్తాడా?

కరణ్ జోహార్ విషయంలో.... ప్రభాస్ స్థానాన్ని విజయ్ దేవరకొండ రీప్లేస్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ ముంబైలోని ధర్మ ప్రొడక్షన్స్ ఆఫీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

జాహ్నవి నోట.. విజయ్ దేవరకొండ మాట

జాహ్నవి నోట.. విజయ్ దేవరకొండ మాట

కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న హిందీ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో పాల్గొన్న జాహ్నవి కపూర్ సైతం విజయ్ దేవరకొండ గురించి హాట్ కామెంట్ చేశాడు. ఏదైనా ఒక రోజు మేల్ యాక్టర్‌గా నిద్రలేవాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారు అనే ప్రశ్నకు ఆమె విజయ్ దేవరకొండ పేరు చెప్పడం గమనార్హం. అవకాశం వస్తే అతడితో నటిస్తానని తేల్చి చెప్పింది.

 బాబోయ్... ఇదంతా కరణ్ జోహార్ ప్లానింగేనంట!

బాబోయ్... ఇదంతా కరణ్ జోహార్ ప్లానింగేనంట!

అయితే ‘కాఫీ విత్ కరణ్' షోలో జాహ్నవి నోట విజయ్ దేవరకొండ పేరు రావడం.... కరణ్ జోహార్ ముందే సెట్ చేసిన ప్లానింగేనంట. బాలీవుడ్ మీడియా, హిందీ ప్రేక్షకులు విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకోవాలనే ఇలా సెట్ చేశాడట.

 త్వరలో కరణ్, జాహ్నవిలతో సినిమా చేస్తానన్న విజయ్

త్వరలో కరణ్, జాహ్నవిలతో సినిమా చేస్తానన్న విజయ్

మరో వైపు ‘టాక్సీవాలా' ప్రమోషన్లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండకు జాహ్నవి కపూర్ గురించి, కరణ్ జోహార్ గురించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీనికి విజయ్ రియాక్ట్ అవుతూ ‘త్వరలోనే కరణ్ జోహార్, జాహ్నవి కపూర్‌తో సినిమా చేస్తాను అంటూ రిప్లై ఇవ్వడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X