»   » వెంకటేష్-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మూవీ?

వెంకటేష్-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మూవీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Vijay Devarakonda Sharing Screen With Venkatesh In Next Movie

'అర్జున్ రెడ్డి' సినిమాతో సంచలన స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అతడు నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. యూఎస్ఏలో తొలి 4 రోజుల్లోనే 1 మిలియన్ మార్క్ అందుకుంది. వరల్డ్ వైడ్ రూ. 21 కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ త్వరలో ఓ మల్టీ స్టారర్ మూవీలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఈ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. 'అర్జున్ రెడ్డి' షూటింగ్ సమయంలోనే విజయ్ ఈ ఆఫర్ ఓకే చేసినట్లు టాక్.

రాక్ లైన్ వెంకటేష్

రాక్ లైన్ వెంకటేష్

ప్రముఖ కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

గీతా ఆర్ట్స్ బేనర్లో

గీతా ఆర్ట్స్ బేనర్లో

ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం గీతా ఆర్ట్స్ బేనర్లో కూడా విజయ్ దేవరకొండ రెండు ప్రాజెక్టులు కమిటైనట్లు సమాచారం. త్వరలో ఈ సినిమాలకు సంబంధించిన వివరాలు అఫీషియల్‌గా వెల్లడికానున్నాయి.

స్టార్ హీరో రేంజ్

స్టార్ హీరో రేంజ్

‘పెళ్లి చూపులు' సినిమా ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.... ‘అర్జున్ రెడ్డి' సినిమాతో స్టార్ హీరో రేంజికి వెళ్లిపోయాడు. చాలా మంది నిర్మాతలు భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తూ ఆయన డేట్స్ కోసం వెంటపడుతున్నారట.

ఆచితూచి అడుగులేస్తున్న విజయ్

ఆచితూచి అడుగులేస్తున్న విజయ్

సినిమా రంగంలో ఎన్ని హిట్స్ వచ్చినా వరుసగా రెండు ప్లాపులు వస్తే అంతే సంగతులు. అందుకే కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఈ ‘అర్జున్ రెడ్డి' సంచలనం.

English summary
Film Nagar source said that, Vijay Devarakonda to share screen space with Venkatesh in next. Popular Kannada producer Rockline Venkatesh is said to be helming the ambitious project, though there are no statements from the makers so far.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu