ఆగిపోయిందా? విజయ్ దేవరకొండ సినిమాపై రూమర్స్...
విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ 'డియర్ కామ్రేడ్' దూకుడుగా బాక్సాఫీసు బరిలో దూకినప్పటికీ కలెక్షన్ల జోరు మాత్రం సాధారణ స్థాయిలోనే ఉంది. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే... విజయ్ నటిస్తున్న మరో చిత్రం ఆగిపోయినట్లు రూమర్స్ ప్రచారంలోకి రావడం ఇడస్ట్రీలో చర్చనీయాంశం అయింది.
డియర్ కామ్రెడ్ చిత్రాన్ని నిర్మించిన 'మైత్రి మూవీ మేకర్స్' బేనర్లోనే విజయ్ 'హీరో' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ అన్నామలై దర్శకుడు. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా జరిగింది. అయితే ఇప్పటి వరకు తీసిన కొన్ని సీన్లపై విజయ్‌తో పాటు నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నిలిపి వేశారని, దర్శకుడు మళ్లీ స్క్రిప్టుపై రీ వర్క్ చేస్తున్నారంటూ రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. మరి ఇందులో నిజం ఎంత? అనేది తెలియాల్సి ఉంది. ఇందులో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ పాత్రలో నటిస్తున్నాడు. మాళవిక మోహన్, శాలిని పాండే హీరోయిన్లు. ఈ చిత్రాన్ని కూడా డియర్ కామ్రేడ్ తరహాలో సౌతిండియాలోని అన్ని భాషల్లో రిలీజ్ ప్లాన్ చేశారు, మరి సినిమా ముందుకు సాగుతుందా? లేదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
'డియర్ కామ్రేడ్' వసూళ్ల విషయానికొస్తే... తొలి రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 6.83 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాలకు కలిపి ఓవరాల్ థియేట్రికల్స్ రైట్స్ రూ. 22.60 కోట్లకు అమ్మినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











