విజయ్ దేవరకొండ ప్లేబాయ్ అంటూ ప్రచారం... నిజమా?
విజయ్ దేవరకొండ ప్లేబాయ్ అంటూ తాజాగా ఫిల్మ్ నగర్లో ఓ వార్త హాట్ టాపిక్ అయింది. అయితే ఇది అతడి రియల్ లైఫ్‌కు సంబంధించిన అంశంలో మాత్రం కాదు. 'డియర్ కామ్రేడ్' మూవీ తర్వాత చేసే సినిమాలో విజయ్ దేవరకొండ ప్లేబాయ్‌గా కనిపించబోతున్నాడట.
విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ పాత్రకు సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. ఇందులో అతడు అమ్మాయిల వెంట పడుతూ వారితో ఎఫైర్లు కొనసాగించే రసికుడిగా నటిస్తున్నట్లు, ప్లేబాయ్ తరహాలో అతడి పాత్ర ఉంటుందని టాక్.

అమ్మాయిలు, ఎఫైర్లు అంటూ తిరిగే హీరో... నిజమైన ప్రేమ అనేది ఎలా తెలుసుకున్నాడు? లవ్ విషయంలో అతడు రియలైజ్ కావడానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించబోతున్నాడట దర్శకుడు.
'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాతో క్రాంతి మాధవ్ ప్రేమకథా చిత్రాలు తీయడంలో తనకంటూ ఓ ప్రత్యేక శైలి ఉందని నిరూపించాడు. విజయ్ దేవరకొండతో ప్రస్తుతం తీస్తున్న సినిమా కూడా ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కేఎస్ రామారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కనీసం నలుగురు హీరోయిన్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్ చేస్తున్నారు. అందులో హీరోయిన్ రాశీ ఖన్నాతో ముద్దు సీన్ ఇండస్ట్రీలోనే టాప్‌గా నిలుస్తుందని టాక్. ఈ మూవీలో ఐశ్వర్యరాజేష్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











