ప్రముఖ డైరెక్టర్‌కునో చెప్పిన అర్జున్‌రెడ్డి! విజయ్ సమస్య అదేనట..
Recommended Video

టాలీవుడ్..బాలీవుడ్..హాలీవుడ్..ఇలా ఏ ఇండస్ట్రీ లో నైనా..ప్రతి నటుడు తన కెరీర్ లో ఏదైనా ఒక్క సినిమా మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉండాలని అనుకుంటాడు. చాలా మంది హీరోలు అలాంటి సినిమాల్లో అవకాశం దక్కించుకోవడానికి వారికి చాలా కాలమే పడుతుంది. ఒకవేళ అలాంటి సినిమా వచ్చింది అని తాను చెప్పుకొని నటించినా కూడా ప్రేక్షకుల మదిలో అలా నిలిచిపోతేనే ఆ సినిమాకి అసలైన విలువ. అలాంటి కథల కోసం మన టాలీవుడ్ హీరోలు చాలా ప్రయత్నాలు చేస్తూనే వున్నారు..కథ బావున్నా కుడా దానికి తగ్గ నటన కనబరిస్తేనే ఆ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది.

బ్రహ్మాండమైన సక్సెస్
కానీ అతి తక్కువ కాలంలో మొదటి అడుగుల్లోనే లైఫ్ లాంగ్ గుర్తుండి పోయే హిట్ అందుకున్న హీరో..విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. స్టార్ హీరోల లెవల్లో హిట్ అందుకున్న విజయ్ ఇప్పుడు దక్షిణాది నుంచి మంచి ఆఫర్స్ అందుకుంటున్నాడు. వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు కూడా.

బాలీవుడ్ నుంచి మూడు ఆఫర్లట..
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విజయ్ దేవరకొండకు బాలీవుడ్ నుంచి బ్రహ్మండమైన ఆఫర్లు వచ్చాయి. ఒకటో అరా అనుకొంటే పప్పులో కాలేసినట్టే.. ఏకంగా మనోడు ఓ మూడు ఆఫర్స్‌ను అందుకున్నాడు. అదికూడా ప్రముఖ యశ్‌రాజ్ ఫిల్మ్ సంస్థ ఆఫర్లు రావడం గమనార్హం. అయితే వాటిని విజయ్ దేవరకొండ తిరస్కరించినట్టు సమాచారం.

యశ్‌రాజ్ ఫిలింస్ సినిమాకు నో
విజయ్ బాలీవుడ్ లో గనక చేస్తే ఇంకా సూపర్ అంటూ అభిమానులు అంటుంటే..మనోడు మాత్రం యశ్ రాజ్ వారు మూడు సినిమా డీల్ సైన్ చేయమంటే.. వరుసగా అన్ని సినిమాలంటే కష్టం అంటూ.. ఆ డీల్ నుండి వెనకడుగు వేశాడట. ఒక్కసారి యశ్ రాజ్ తో అలాంటి డీల్ చేస్తే.. వారి మూడు సినిమాలు అయ్యేవరకు వేరే సినిమాలు చేయడానికి లేదు. అందుకే విజయ్ ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు టాక్.

టాక్సీ డ్రైవర్‌గా విజయ్
ప్రస్తుతం తెలుగులో దర్శకుడు పరుశురాం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టాక్సీ డ్రైవర్ అనే పేరును ఖారారు చేసినట్టు సమాచారం. అయితే త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

మహానటిలో కీలకపాత్ర
కాగా ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మహానటి చిత్రంలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. ఈ చిత్రంలో కేవలం 15 నిమిషాల పాత్ర అయినా.. దుమ్మురేపినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రను విజయ్ దేవరకొండ పోషిస్తున్నట్టు ఇన్‌సైడ్ టాక్.


Click it and Unblock the Notifications











