Vijay Devarakonda: లైగర్ ఫ్లాప్.. రెమ్యునరేషన్లో భారీ మొత్తం ఇచ్చేసిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ డేరింగ్ అండ్ మాస్ డైరెక్టర్ అంటే వెంటనే గుర్తు వచ్చే పేరు పూరీ జగన్నాథ్. ఆయన సినిమాలకు ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. జయాపజయాల సంగతి పక్కన పెట్టి ఆయన డైలాగ్స్, స్క్రీన్ ప్లేకు అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురిచి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన యాటిట్యూడ్‌తో అర్జున్ రెడ్డిగా అతి తక్కువ కాలంలోనే ఒక స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో తొలిసారిగా తెరకెక్కిన చిత్రం లైగర్. ఆగస్టు 25న విడుదలైన ఈ మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో మూవీ నిర్మాతలు నష్టాలపాలయ్యారు. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు విజయ్ దేవరకొండ చేసిన పని అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

నెగెటివ్ టాక్..
లైగర్ మూవీని ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. అత్యంత భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా మూవీగా ఆగస్టు 25న విడుదలైంది లైగర్ చిత్రం. రిలీజైన తొలి రోజు నుంచే మూవీపై నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. పూరి జగన్నాథ్‌పై విమర్శలు సైతం వచ్చాయి.

రూ. 200 కోట్లు వసూలు చేస్తుందని..
అయితే లైగర్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగినా.. విడుదల తర్వాత సీన్ మారిపోయింది. ఈ మూవీ విడుదలకు ముందు రూ. 200 కోట్లకు పైగా వసూలు చేస్తుందని ఆశపడ్డ విజయ్ దేవరకొండ ఆశలు తలకిందులయ్యాయి. అన్ని భాషల్లోనూ లైగర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో మూవీ నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టాలను మిగిల్చిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ మూవీ నిర్మాతల్లో ఛార్మీతోపాటు బాలీవుడ్ దర్శక నిర్మాత అయిన కరణ్ జోహార్ ఒకరు. పూరి జగన్నాథ్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరించాడు. లైగర్ పరాజయంతో పూరీ జగన్నాథ్ తన పారితోషికంతోపాటు లాభాల్లో వచ్చిన తన వాటాలో 70శాతం వెనక్కి ఇచ్చేశాడని సమాచారం.

పూరి బాటలో విజయ్ దేవరకొండ..
ఇక ఇదే బాటలో విజయ్ దేవరకొండ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. లైగర్ చిత్రానికి విజయ్ దేవరకొండ రూ. 35 కోట్ల పారితోషికం అందుకున్నాడని ఇప్పటికే వార్తలు వినిపించాయి. దీంతోపాటు నాన్ థియేట్రికల్ రైట్స్‌లో విజయ్‌కు సైతం వాటా ఉందని సమాచారం. ఇప్పుడు ఆ వాటాను వద్దని పూరీ, ఛార్మీలకు చెప్పడమే కాకుండా తన పారితోషికంలో రూ. 6 కోట్లను వెనక్కి ఇచ్చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసిన విజయ్ ఫ్యాన్స్ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారట. నష్టాల్లో ఉన్న నిర్మాతలను ఆదుకున్న రియల్ హీరో అని కొనియాడుతున్నారట.


Click it and Unblock the Notifications











