»   » వర్మ గారు నన్ను క్షమించండి..సుతిమెత్తగా షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!

వర్మ గారు నన్ను క్షమించండి..సుతిమెత్తగా షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!

Subscribe to Filmibeat Telugu
వర్మ కి నో చెప్పిన విజయ్ దేవరకొండ!

వర్మ తన దర్శకత్వ ప్రతిభతో ట్రెండ్ సెట్ చేయగలిగేంత టాలెంట్ ఉన్న దర్శకుడు. కానీ ఈ మధ్య కాలంలో వర్మ ఎక్కువగా వివాదాలతోనే సహవాసం చేస్తున్నాడు. ఇటీవల జీఎస్టీ అంటూ పోర్న్ స్టార్ మియా మాల్కోవతో చిత్రం తీసి వివాదంలో చిక్కుకున్నాడు. వర్మ తాజాగా నాగార్జునతో ఆఫీసర్ చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. వర్మకు చిత్రాలని ప్రకటించడం వాటిని పక్కన పెట్టేయడం బాగా అలవాటే. ఆ మద్యన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పేరుతో బాగా హడావిడి చేసాడు. కానీ చిత్రం ఇప్పుడు ఏమైందో ఎవరికీ తెలియదు. నాగార్జునతో సినిమా చేస్తున్న వర్మ ఆ తరువాత విజయ దేవర కొండతో ఓ సినిమా ప్లాన్ చేసాడట. కానీ వర్మకు ఊహించని షాక్ తగిలినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

 వివాదాల వర్మ

వివాదాల వర్మ

రామ్ గోపాల్ వర్మ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటాడు. వర్మ తెరకెక్కించిన జీఎస్టీ చిత్రం విషయంలో ఏస్థాయిలో దుమారం రేగిందో అందరికి తెలిసిందే. వర్మపై జీఎస్టీ చిత్రం విషయంలో పోలీస్ కేసు కూడా నమోదైంది.

 ఆఫీసర్ ని రెడీ చేసే పనిలో

ఆఫీసర్ ని రెడీ చేసే పనిలో

వర్మ ప్రస్తుతం నాగార్జునతో ఆఫీసర్ అనే చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏమైనట్లు

లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏమైనట్లు

ఆ మధ్యన వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఆ చిత్ర ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చింది. కానీ ఆ చిత్రాన్ని వర్మ పూర్తిగా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. వర్మ సినిమాలని ప్రకటించడం వాటిని పక్కన పెట్టేయడం అతడికి అలవాటే.

 విజయ్ దేవరకొండపై కన్ను

విజయ్ దేవరకొండపై కన్ను

అర్జున్ రెడ్డి చిత్రం తరువాత వర్మ కన్ను విజయ్ దేవరకొండపై పడింది. ఆ చిత్రాన్ని, విజయ్ దేవర కొండని వర్మ ప్రశంసలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ నటన అందరిని ఆకట్టుకుంది. అప్పుడే వర్మ కన్ను విజయ్ పై పడింది.

 విజయ్ తో సినిమా చేద్దామని ప్రయత్నిస్తే

విజయ్ తో సినిమా చేద్దామని ప్రయత్నిస్తే

ప్రస్తుతం నాగ్ తో సినిమా చేస్తున్న వర్మ ఈ చిత్రం తరువాత విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనీ భావించాడట. అతడి కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డాడట. వర్మ విజయ్ దేవరకొండని సంప్రదించగా ఊహించని సమాధానం ఎదురైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తాను చేయలేనని విజయ్ వర్మకు చెప్పాడట.

 కారణం ఇదే

కారణం ఇదే

అర్జున్ రెడ్డి చిత్రం తరువాత విజయ్ దేవరకొండకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కమిటై ఉన్న చిత్రాలు పూర్తి చేయడానికి సమయం పడుతనదని అందువలన మీ చిత్రాన్ని చేయలేనని వర్మకు సుతిమెత్తగా అర్జున్ రెడ్డి షాక్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

English summary
Vijay Devarakonda Shocks Varma. Vijay Devarakonda says no to RGV movie proposal
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu