FAMILY STAR: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు షాక్.. ఫ్యామిలీ స్టార్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండానే హీరోగా పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయికి ఎదిగాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. ఆరంభంలోనే ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. క్రేజ్‌తో పాటు మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం వరుస ఫ్లాపులతో ఈ రౌడీ బాయ్ సతమతం అవుతున్నాడు.
కొంత కాలంగా వరుసగా ఫ్లాపులను చవి చూస్తోన్న విజయ్ దేవరకొండ.. ఈ సారి ఎలాగైనా భారీ హిట్‌ను ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం తన 13వ చిత్రం 'ఫ్యామిలీ స్టార్'ను పరశురాం దర్శకత్వంలో చేస్తున్నాడు. 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

హిట్ కాంబినేషన్‌లో రాబోతున్న 'ఫ్యామిలీ స్టార్' మూవీని అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయింది. త్వరలోనే మిగిలిన దాన్ని కూడా పూర్తి చేసి.. సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేసింది. ఇదే విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించింది.
విజయ్ దేవరకొండ నటిస్తోన్న 'ఫ్యామిలీ స్టార్' మూవీని సంక్రాంతికి విడుదల చేయడం లేదని ఇటీవలే తెలిసింది. దీనికి కారణం షూటింగ్ ఆలస్యం అవడమే అని అంటున్నారు. హడావిడిగా సినిమాను రిలీజ్ చేయడం ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉందని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకే దీన్ని హోల్డ్ చేస్తున్నట్లు దిల్ రాజు బయ్యర్లకు కూడా చెప్పారట.
ముందుకు ప్లాన్ చేసినట్లు సంక్రాంతికి రాలేకపోతోన్న 'ఫ్యామిలీ స్టార్' మూవీని సమ్మర్‌లో రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా న్యూస్ లీకైంది. అంతేకాదు, దీన్ని వచ్చే ఏడాది మార్చి 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా వెల్లడించబోతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ - పరశురాం పెట్ల కలిసి చేస్తున్న 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











