FAMILY STAR: ఫ్యామిలీ స్టార్ వచ్చేది ఆరోజే.. ఎన్టీఆర్ నిర్ణయం కోసం విజయ్ వెయిటింగ్!
స్వయంకృషితోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. కెరీర్ ఆరంభంలోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి.. ఆ తర్వాత 'పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా మారాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ. దీనికితోడు ఆరంభంలోనే వరుసగా హిట్లను సొంతం చేసుకుని స్టార్ స్టేటస్‌ను అందుకున్నాడు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తోన్న అతడికి వరుసగా షాక్‌లు తగిలాయి.
ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతోన్న విజయ్ దేవరకొండ.. ఈ సారి బిగ్ సక్సెస్‌ను కొట్టాలన్న లక్ష్యంతో ఉన్నాడు. ఇందుకోసం తన 13వ చిత్రంగా 'ఫ్యామిలీ స్టార్'ను చేస్తున్నాడు. 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురాం దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని తెరకెక్కిస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'ఫ్యామిలీ స్టార్' మూవీని అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయింది. త్వరలోనే మిగిలిన దాన్ని కూడా పూర్తి చేసి.. సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేసింది. కానీ, ఊహించని విధంగా రేసు నుంచి తప్పుకుంది.
విజయ్ దేవరకొండ నటిస్తోన్న 'ఫ్యామిలీ స్టార్' మూవీని సంక్రాంతికి విడుదల చేయకపోవడంతో కొత్త రిలీజ్ డేట్‌పై ఎన్నో రకాల ప్రచారాలు వచ్చాయి. ఈ క్రమంలోనే చాలా డేట్లు కూడా తెరపైకి వచ్చేశాయి. కానీ, చిత్ర యూనిట్ మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా 'ఫ్యామిలీ స్టార్' మూవీ రిలీజ్ డేట్‌పై క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ నటిస్తోన్న 'ఫ్యామిలీ స్టార్' మూవీని ఈ ఏడాది మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా వెల్లడించబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఎన్టీఆర్ 'దేవర' రిలీజ్ వాయిదా పడితే దీన్ని ఏప్రిల్ 5వ తేదీన తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ - పరశురాం పెట్ల కలయికలో రూపొందుతోన్న 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











