VD13: సంక్రాంతికి ఫ్యామిలీ స్టార్.. రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు షాక్ తప్పదా.. ఆసక్తికరంగా పండుగ సీజన్

టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్‌కు ప్రత్యేకమైన పోటీ ఉంటుంది. పండుగ సెలవులు వచ్చిన సమయంలో తమ చిత్రాలను విడుదల చేయాలని చాలా మంది హీరోలు, ఫిల్మ్ మేకర్లు ప్లాన్లు చేసుకుంటారు. ఇలా ప్రతి ఏడాది భారీ భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి.

ఇందులో భాగంగానే వచ్చే ఏడాది సంక్రాంతి కోసం అప్పుడే కొన్ని చిత్రాలు రిలీజ్‌ను కన్ఫార్మ్ చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ కూడా పొంగల్ రేసులో నిలిచినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

Vijay Devarakonda Starrer FAMILY STAR Release on Pongal

ఖుషి మూవీతో రాబోతున్నాడు: విజయ్ దేవరకొండ గత ఏడాది 'లైగర్' అనే పాన్ ఇండియా చిత్రంతో వచ్చాడు. కానీ, ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుస ప్రాజెక్టులతో సత్తా చాటుతోన్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'ఖుషి' అనే లవ్ స్టోరీ మూవీ చేస్తున్నాడు. సమంత డేట్స్ వల్ల కాస్త ఆలస్యం అయిన ఈ సినిమా.. సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కాబోతుంది.

Vijay Devarakonda Starrer FAMILY STAR Release on Pongal

గౌతమ్‌తో ఒకటి.. పరశురాంతో: విజయ్ దేవరకొండ 'ఖుషి' మూవీ షూటింగ్ జరుపుకుంటూ ఉండగానే.. తన 12వ సినిమాను 'జెర్సీ' ఫేం గౌతమ్ తిన్ననూరితో చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇది ఇంకా మొదలు కాకముందే అతడు తన 13వ చిత్రాన్ని పరశురాం పెట్ల దర్శకత్వంలో చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Vijay Devarakonda Starrer FAMILY STAR Release on Pongal

అలాంటి టైటిల్‌తో విజయ్: 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ - పరశురాం కాంబోలో రాబోతున్న ఈ చిత్రం కూడా కుటుంబ కథతోనే తెరకెక్కుతుందట. దీంతో ఈ సినిమాకు డీసెంట్ టైటిల్ పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే దీని కోసం నిర్మాత దిల్ రాజు 'ఫ్యామిలీ స్టార్' అనే పేరును ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేయించారని తెలిసింది.

Vijay Devarakonda Starrer FAMILY STAR Release on Pongal

ప్రీ ప్రొడక్షన్.. జెట్ స్పీడుతో: హిట్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతున్నట్లు తెలిసింది. అది కంప్లీట్ అయిన వెంటనే రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలు పెడతారట. ఇక, ఈ మూవీలో సగం షూటింగ్ యూరప్‌లో జరగనుందట. మిగిలింది ఇండియాలోనే ప్లాన్ చేసినట్లు తెలిసింది. మొత్తానికి దీన్ని నవంబర్ నాటికి పూర్తి చేస్తారని సమాచారం.

సంక్రాంతి బరిలో విజయ్: విజయ్ దేవరకొండ - పరశురాం పెట్ల కాంబోలో రాబోతున్న చిత్రాన్ని ఎంతో వేగంగా పూర్తి చేసేలా ప్లాన్ చేశారట. అంతేకాదు, ఈ చిత్రాన్ని ఏకంగా సంక్రాంతి బరిలో నిలపాలని తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇప్పటికే పొంగల్ బరిలో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. అయినప్పటికీ ఫ్యామిలీ స్టోరీతో వచ్చే ఈ సినిమాను పండుగకే కరక్ట్ అనుకుంటున్నారట.

Vijay Devarakonda Starrer FAMILY STAR Release on Pongal

అంటే చరణ్ సినిమా కష్టమే: విజయ్ దేవరకొండ హీరోగా నటించే 'ఫ్యామిలీ స్టార్' మూవీ సంక్రాంతికి విడుదలవుతుందని వార్తలు వస్తుండగానే.. ముందుగా ప్రకటించిన 'గేమ్ చేంజర్' వాయిదా పడినట్లు కూడా మరో టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ రెండు చిత్రాలకూ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి విజయ్ సినిమా అప్పుడు రిలీజ్ చేయాల్సి వస్తే.. చరణ్‌ది వాయిదా వేస్తారని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X