FAMILY STAR: సంక్రాంతి రేసులో బిగ్ ట్విస్ట్.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు షాక్
స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన టాలెంట్లతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును, క్రేజ్‌ను సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ. దీనికితోడు ఆరంభంలోనే ఎన్నో హిట్లను సైతం ఖాతాలో వేసుకుని స్టార్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. అయితే, వరుసగా అతడికి షాక్‌లే తగులుతున్నాయి. ముఖ్యంగా గత రెండు చిత్రాలు పరాజయం పాలవడం నిరాశకు గురి చేసింది. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసితో విజయ్ దేవరకొండ ఉన్నాడు.
ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతోన్న విజయ్ దేవరకొండ ఇప్పుడు తన 13వ చిత్రం 'ఫ్యామిలీ స్టార్'ను పరశురాంతో చేస్తున్నాడు. 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయింది. త్వరలోనే మిగిలిన దాన్ని కూడా పూర్తి చేసి.. సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.

హిట్ కాంబినేషన్‌లో రాబోతున్న 'ఫ్యామిలీ స్టార్' మూవీని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు ఓ టీజర్‌తో పాటు పోస్టర్లను కూడా రిలీజ్ చేసింది. కానీ, తాజా సమాచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ మూవీని సంక్రాంతికి విడుదల చేయడం లేదని తెలిసింది. దీనికి కారణం షూటింగ్ ఆలస్యం అవడమే అని అంటున్నారు. హడావిడిగా సినిమాను రిలీజ్ చేయడం ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉందని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే దీన్ని హోల్డ్ చేస్తున్నట్లు బయ్యర్లకు కూడా చెప్పారని టాక్.
విజయ్ దేవరకొండ - పరశురాం పెట్ల కలిసి చేస్తున్న 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











