Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్‌కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్‌పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
విజయ్ దేవరకొండ టాక్సీ వాలా సినిమా వాయిదా !
యువహీరో విజయ్ దేవరకొండ తాజాగా చేసిన సినిమా టాక్సీ వాలా కొత్త డైరెక్టర్ రాహుల్ సంకృతియన్ దర్శకత్వంలోన్ వస్తున్న ఈ చిత్రాన్ని జిఎ2 పిక్చర్స్, యూవీ క్రియేఫన్స్ బేనర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ప్రియాంక జవల్కర్, మాళవిక నాయర్లు ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తడంతోనే సినిమా విడుదలకు ఆలస్యం అవుతుందని అంటున్నారు . యు వి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వం వహించాడు. ఈ నెల చివరి వారంలో టాక్సీ వాలా రిలీజ్ కానుందని ప్రకటించారు. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నెల సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదని సమాచారం.
ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తడంతోనే సినిమా రిలీజ్ లేట్ అవుతుందని సమాచారం. త్వరలో కొత్త విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించబోతోందని సమాచారం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ టాక్సీ డ్రైవర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
విజయ్ దేవరకొండ ఈ సినిమా తరువాత పరుశురంబుజ్జి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. త్వరలో ఆ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నోటా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాల తరువాత నందిని రెడ్డితో, దర్శకుడు క్రాంతి మాధవ్ తో సినిమాలు చెయ్యబోతున్నాడు విజయ్ దేవరకొండ.