VD13: దిల్ రాజుతో విజయ్ దేవరకొండ న్యూ ప్రాజెక్ట్.. దర్శకుడు ఎవరంటే?
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ గత ఏడాది లైగర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి ఒపెనింగ్స్ అయితే అందుకున్నాడు కానీ పూర్తి స్థాయిలో మాత్రం సినిమా సక్సెస్ కాలేకపోయింది. విజయ్ ఆ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసినప్పటికీ పూరి జగన్నాధ్ రొటీన్ మేకింగ్ కారణంగా ఫ్లాప్ అయ్యింది. అయితే అందులో విజయ్ దేవరకొండ యాక్టింగ్ చేసిన విధానం మాత్రం ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక ఫ్లాప్ వచ్చినా అతని రేంజ్ అస్సలు తగ్గలేదు. ఇక విజయ్ తదుపరి ప్రాజెక్ట్ ఖుషితో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. శివ నిర్వణ దర్శకత్వంలో తెరపైకి రానున్న ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవల విజయ్ మరో కొత్త ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో తన 12వ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు. ఆ సినిమా కూడా త్వరలోనే మొదలు కానుంది. అందులో విజయ్ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.

ఇక విజయ్ ఇప్పుడు మరో సినిమాను ఎనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో చేయబోతున్నట్లు సమాచారం. ఇక విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన పరశురామ్ దర్శకత్వంలో ఆ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. పరశురామ్ తో విజయ్ గీతగోవిందం అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ అందించిన సినిమాగా నిలిచింది.
అయితే గీత ఆర్ట్స్ లోనే గీత గోవిందం సీక్వెల్ కూడా ఉంటుందని కొత్త టాక్ వినిపించింది. ఇక ఆ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే విషయంలో క్లారిటీ ఇవ్వకముందే ఇప్పుడు ఈ కాంబినేషన్లో దిల్ రాజు సినిమాని నిర్మిస్తున్నారు అని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ సుకుమార్ తో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. హరీష్ శంకర్ తో కూడా విజయ్ గతంలో ఒక కథపై చర్చలు జరిపారు. మరి ఈ కాంబినేషన్ పై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











