Vijay Devarakonda: బుల్లితెరపై సందడి చేయనున్న విజయ్ దేవరకొండ.. త్వరలోనే..!
లైగర్ సినిమాతో ఫ్లాప్ అందుకున్నా... విజయ్ దేవరకొండకు మాత్రం ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. పాన్ ఇండియా లెవెల్ ఆయనకు గుర్తింపు అయితే ఉంటుంది. అయితే ఆయన తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం ఖుషి. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఓ ప్రముఖ టీవీలోని ఓ షోలో చీఫ్ గెస్టుగా రాబోతున్నారు. ఆ షో ఏంటి.. ఎప్పుడు ప్రసారం కానుంది అనే వివరాలు ఈస్టోరీలో తెలుసుకుందాం.
విజయ్ దేవరకొండ.. నువ్విలా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ మూవీలో చేసింది చిన్న రోల్ అయినా.. మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో కీ రోల్ చేసి.. ఇంకాస్త క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత నానితో కలిసి ఎవడే సుబ్రమణ్యం మూవీ చేశాడు. ఇక తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి చూపులు సినిమాలో హీరోగా చేసి.. మొదటి సినిమానే సూపర్ హిట్టు కొట్టాడు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా కమర్షియల్ గా సక్సెస్ అయింది.

ఆ తర్వాత ద్వారకా అనే సినిమా చేశాడు విజయ్. ఇక ఈ మూవీ అంతగా ఆడలేదు. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో అర్జున్ రెడ్డి సినిమా చేసి.. విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయింది. ఇక ఇదే మూవీని సందీప్ రెడ్డి.. షాహిద్ కపూర్ తో తీయగా అక్కడ కూడా మంచి సక్సెస్ అయింది. ఇక ఈ మూవీ తర్వాత విజయ్ స్టార్ డం పెరిగిపోయింది. ఒక్క సారిగా ఇండియా వైడ్ గా ఫేమస్ అయ్యాడు.

వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్. గత ఏడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్.. పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ చేశారు. దీనిమీద ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ్ కు బాక్స్ ఆఫీస్ వద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఈ సినిమా ఘోర పరాజయం పొందింది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ ఖుషి అనే సినిమా చేశాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నారు.
బుల్లితెరపై విజయ్ సందడి అంటే.. బాలకృష్ణ లా అన్ స్టాపబుల్, లేదా నాగార్జునల బిగ్ బాస్ షో అనుకుంటే పొరపాటే. ఆయన మా టీవీలో ప్రసారం అయ్యే నీతోనే అనే డ్యాన్స్ షో లో సందడి చేయనున్నారట. ఇక ఈ షో చివరి ఎపిసోడ్ ఈ మధ్యనే పూర్తి చేసుకుందట. ఈ డ్యాన్స్ షో ఫైనల్ ఎపిసోడ్ కు విజయ్ దేవరకొండ గెస్టుగా రానున్నట్లు సమాచారం. ఆ షోలో విజయ్ పాల్గొని.. సందడి చేయనున్నారట

నీతోనే డ్యాన్స్ షో ఫినాలి ఎపిసోడ్ లో విజయ్ సందడి చేయడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక ఖుషి మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే ఈ షోలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ వచ్చేనెల 1వ తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీలో సమంత హీరోయిన్ నటించింది.


Click it and Unblock the Notifications











