విజయ్ దేవరకొండ, బోయపాటి భారీ యాక్షన్ చిత్రం.. దిల్ రాజు పక్కా ప్లాన్‌తో

సూపర్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ బాడా దర్శకులతో సినిమాలు చేసేందుకు పక్కాగా ప్లాన్ చేసుకొంటున్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే పూరి జగన్నాథ్, సుకుమార్‌ లాంటి దర్శకులతో మూవీస్ కమిట్ అవ్వడం తెలిసిందే. ఇక దిల్ రాజుతో కూడా ఓ సినిమా చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. విజయ్ దేవరకొండతో బోయపాటితో భారీ యాక్షన్ సినిమాను తెరకెక్కించేందుకు దిల్ రాజ్ ప్లాన్ చేస్తున్నట్టు తాజా సమాచారం.

ఇప్పటికే బోయపాటి, విజయ్ దేవరకొండ మధ్య రెండు సార్లు సమావేశం జరిగింది. రెండుసార్లు వారి మధ్య కథా చర్చలు జరిగాయి. బోయాపాటి చెప్పిన రెండు కథల్లో ఒక దానిని ఫైనలైజ్ చేయాలనే ఆలోచనలో విజయ్ దేవరకొండ ఉన్నట్టు తెలుస్తున్నది. కమర్షియల్ హంగులతోపాటు వినోదాత్మకంగా సాగే కథపై ఈ కాంబినేషన్ దృష్టిపెట్టినట్టు సమాచారం.

Vijay Deverakonda action movie with Boyapati Srinu in Dil Raju banner

అయితే దిల్ రాజుతో విజయ్ దేవరకొండ ఓ భారీ ప్రాజెక్టు చేస్తున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఇంద్రగంటి మోహనకృష్ణతో కూడా ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారనే వార్త వచ్చింది. అయితే బోయపాటితో సినిమా అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఈ ఏడాది చివర్లో సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందనే వార్త వినిపిస్తున్నది.

ఇదిలా ఉండగా, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఫైటర్ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ చిత్రానికి కరణ్ జోహర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X