ఒకేసారి హాలిడేస్ కు వెళుతున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. అక్కడ అలా కనిపించడంతో..

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కు సంబంధించిన వార్తలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. వారు ఏ మాత్రం కలుసుకున్నా లేదంటే ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకున్న కూడా మళ్లీ ఏదో కొనసాగుతోంది అన్నట్లుగా వార్తలు పుట్టుకొస్తూ ఉంటాయి. అయితే ఈసారి రష్మిక అలాగే విజయ్ దేవరకొండ విమానాశ్రయం లో ఒకేసారి కనిపించడంతో.. అలాగే వారు ఇద్దరు కూడా ఓకే హాలిడే లోకేషన్ కి వెళ్తూ ఉండడంతో.. మరో న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే...

విజయ్ కనిపించగానే..

విజయ్ కనిపించగానే..

విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో చాలా కాలం పాటు ట్రావెల్ అయ్యాడు. అంతేకాకుండా సినిమా విడుదలకు ముందే ఖుషి అనే మరొక సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. ఇక ఒకవైపు రిలీజ్ ప్రమోషన్ మరొకవైపు సినిమా షూటింగ్ లతో చాలా బిజీ బిజీగా పాల్గొన్న విజయ్ ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉండడానికి హాలిడేస్ కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. రీసెంట్ గా ముంబై విమానాశ్రయం లో అతను కనిపించగానే బాలీవుడ్ కెమెరాలు అతని వైపు ఫోకస్ చేశాయి.

 అంతకుముందు రష్మిక

అంతకుముందు రష్మిక

అయితే అదే విమానాశ్రయం లో అంతకుముందు రష్మిక మందన్న కూడా హాలిడేస్ కు వెళుతున్నట్లు కనిపించింది. ఆమె కూడా చాలా కాలంగా బ్రేక్ తీసుకోలేదు. మొన్నటి వరకు బాగా బిజీగా కనిపించినా రష్మిక ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకునేందుకు హాలిడే లోకేషన్ కు వెళ్తోంది. ఇక దాదాపు విజయ్ దేవరకొండ తరహాలోనే ఆమె ఇప్పుడు అతను వెళుతున్న లొకేషన్ కే వెళుతొంది అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అప్పట్లోనే చాలా రూమర్స్

అప్పట్లోనే చాలా రూమర్స్

ఇక ఇద్దరు కూడా ఇదివరకే గీత గోవిందం సినిమాలో మంచి రొమాంటిక్ లవ్ బర్డ్స్ గా కనిపించి బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. ఇక తర్వాత మరోసారి డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో విజయ్ దేవరకొండ రష్మిక మందన మధ్య ప్రేమ కూడా ఉంది అని చాలా రకాల కథనాలు వెలుపడ్డాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు అని కూడా ఆ తర్వాత వాళ్లు క్లారిటీ చేశారు.

అక్కడికి వెళుతున్నారా?

అక్కడికి వెళుతున్నారా?

అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఇద్దరు కలిసి వెళ్తున్నట్లుగా సోషల్ మీడియాలో అనేక రకాలు కథనాలు వెలువడుతున్నాయి. ఇద్దరు పర్సనల్ ట్రిప్ లో భాగంగా మాల్దీవ్స్ వెళ్తున్నప్పటికీ కూడా ఈ తరహా కథనాలు ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మాల్దీవ్స్ కు ఎప్పటినుంచో వెళ్ళాలి అనుకున్నప్పటికీ కూడా బిజీ షూటింగ్స్ కారణంగా ఇద్దరికీ కుదరలేదట. ఇక ఇప్పుడు ఎవరికి వారు పర్సనల్ గానే వెళ్లడం.. అలాగే ఒకేసారి యాదృచ్చికంగా విమానాశ్రయం కనిపించడంతో సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ విషయంపై ఏదైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X