విజయ్ దేవరకొండ స్పీడయ్యాడు.. మెగా, నందమూరి హీరోలతో సమరానికి సై!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాస్త స్పీడు పెంచేశాడట. అదేంటి మనోడు ఎప్పుడూ స్పీడే కదా! మళ్ళీ కొత్తగా పెంచడానికి ఏముంటుంది? అనే సందేహం కలగడం కామనే. అయితే ఇక్కడ విజయ్ దేవరకొండ పెంచుతున్నది తన షూటింగ్ స్పీడు. వేగంగా వచ్చేసి ఏకంగా బాలయ్యబాబును ఢీ కొట్టాలనే టార్గెట్ పెట్టుకున్నాడట ఈ కుర్ర హీరో.

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తుండటం విశేషం. రాశిఖన్నా మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కేథరిన్ థ్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఎజిబెల్లా కూడా మరో ముగ్గురు హీరోయిన్లుగా కనిపించనున్నారు.

Vijay Deverakonda Clash With Mega, Nandamuri heroes

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. యూత్ టార్గెట్‌గా 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా రూపొందుతోంది. పైగా లవర్ అనే ట్యాగ్ టైటిల్ లో కనిపిస్తోంది కాబట్టి ఈ సినిమాను లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేయాలని సన్నాహాలు చేశారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ మరింత వేగవంతం చేసి డిసెంబర్ 20వ తేదీనే చిత్రాన్ని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్.

అదే రోజు సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న 'ప్రతి రోజు పండగే' విడుదల కానుంది. అలాగే బాలకృష్ణ హీరోగా రాబోతున్న రూలర్ సినిమా కూడా అదే రోజు విడుదలకు సిద్ధమవుతోంది. సో.. ఈ లెక్కన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, నందమూరి నటసింహం బాలకృష్ణతో సమరానికి సాయి అంటున్నాడన్నమాట రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. చూడాలి మరి దీనిపై ఎలాంటి అఫీషియల్ స్టేట్‌మెంట్ వస్తుందో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X